Tuesday, May 7, 2024

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన..

తప్పక చదవండి

జనగామ పట్టణంపై ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.. వర్షం తగ్గి 24 గంటలు గడిచిన జనగామ పట్టణ లోని హైదరాబాద్ నుండి హన్మకొండ ప్రధాన రహదారి కుర్మవాడ ఏరియా లో నీళ్లు భారీగా రావడం వలన వ్యాపారస్థులు ప్రయాణికులు, చుట్టు పక్కల ఉండే నీవాసం ఉండే ప్రజలందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇంత వరకు ఏమ్మెల్యే, మున్సిపల్ అధికారులు గానీ స్పందించక పోవడం సిగ్గు చేటు అని, ఈ పరిస్థితి కి కారణం ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల అసమర్ధత నిర్లక్ష్యం అని, కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి డ్రైనేజి కూడా సరిగ్గా కట్టలేని చేతకానీ ఎమ్మెల్యే, మున్సిపల్ పనితీరుని నిరసిస్తూ జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో జనగామ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతకింది మల్లేష్, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ మాజీద్, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ జాఫర్ షరీఫ్, ఉపాధ్యక్షులు సుల్తాన్ గోవింద్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నోముల రాజు, కొండ శ్రీను, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సౌడ మహేష్, ఎండీ అజామ్, ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు