Sunday, July 21, 2024

మెక్సికోలోని నయారిట్‌లో బస్సు ప్రమాదం.

తప్పక చదవండి
  • ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు.
  • మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
  • బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని..
  • వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
    మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్‌ రాష్ట్ర రాజధాని టెపిక్‌ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం గురించి తెలియగానే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌ చాలా క్లిష్టంగా సాగాయని సహాయక సిబ్బంది వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
    కాగా, ఇటీవల మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. గత నెలలో ఓక్సాకాలో అదుపుతప్పి ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో సెంట్రల్‌ మెక్సికోలో క్రాసింగ్‌ వద్ద వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు