Sunday, October 6, 2024
spot_img

వాళ్ళు క్యూ కట్టారు..

తప్పక చదవండి

ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారని
ఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..
రేయనకా పగలనకా
వారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరి
క్షతగాత్రులకు మేమున్నామని
తమ రక్తాన్నిచ్చి కాపాడుకొనే
ఆరాటం కి ఏమిచ్చి ఋణం
తీర్చుకోగలం ఆ జనజాగృతికి
ఏ బంధం ఎరుగరు
మానవ సంబంధమే మహా
గొప్పదనీ ఏ కులమో
ఏ ఊరో ఏ మతమో చూడకనే
దవాఖానాల ముందు
ధైర్యంగా అలసిపోకుండా
రాత్రంతా క్యూ కట్టారంటే
ఇంతకన్నా ఏమి ఋజువో
మానవత్వానికి మన జాతి
ఔన్నత్యానికి కావల్సిందీ
కాలం కఠోరంగా వున్నప్పుడే
మనిషన్న మానవత్వమన్నా
మన ముందు నిలిచేది కదా
నాకెందుకులే అనుకోలే
గా రైలుపట్టాల వెంటవున్న
గీ వూరు గావూరనక జనమంతా పరుగులతీసి
ఆపన్నహస్తులయ్యి ఆదుకుంటే
నిజంగా మనమంతా
వారికి సెల్యూట్ కొట్టాలి
ఆ ప్రాణదాతలకు సలాం
చేయాలి ప్రణామమనాలి
ఆ క్యూ కట్టినోళ్ళకి
జాతియవత్తు నీరాజనమిచ్చి
జేజేలు పలకాలి జై మానవతా
జైజై మానవతా మూర్తులకు…

  • యం.డీ. రంజాన్ బేగ్..
    9949552956.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు