Sunday, October 13, 2024
spot_img

కాకినాడలో టిప్పర్‌ బీభత్సం..

తప్పక చదవండి

ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్‌ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్‌ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్‌రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు. అనంతరం టిప్పర్‌ నీళ్ల ట్యాంకర్‌ను ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఆలయం పూర్తిగా ధ్వంసమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు