వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..
అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..
నీ ఉనికే ఆధారం – ఈ సృష్టికి ప్రాణం ..
శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..
నీ మనసే అపురూపం – అది స్వార్థ రహితం..
అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..
నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..
విజయాలకు సోపానం ..నీ జీవన లక్ష్యం…
నీ జీవన పోరాటం – అభ్యున్నతి నీ ధ్యేయం
ప్రతిఘటించు అన్యాయం .. తెలియచేయి నీ స్థానం..
ఆశయాల సాధనలో – అనురాగపు బంధముతో
నీ విలువను గుర్తించి – నీకు జరుగు సమ్మానం..
నీ హృదయపు లోగిలిలో – ప్రతి దినమూ మహోత్సవం..
- విజయభారతి. అంతర్వేదిపాలెం..
9052445001..