Thursday, September 12, 2024
spot_img

పల్లెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం..

తప్పక చదవండి

తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ని గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చక్రవర్తి గౌడ్ మాట్లాడుతూ పల్లె గౌడ్ కులానికి అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రభుత్వం పల్లె సేవలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ్ హాస్టల్ ఎంసీ సభ్యులు సోమా శైలాజా గౌడ్, ప్రతాప్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, సిద్దూ గౌడ్, స్వప్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కళ్యాణ్ గౌడ్, హాస్టల్ సిబ్బంది విజయలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖుల శుభాకాంక్షలు :
సూర్యాపేట జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, తెలంగాణ గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జివికె న్యూస్ అధినేత వసంత్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, రాజయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్, సైదులు గౌడ్, భీష్మ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, నరేందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నర్సింగ్ గౌడ్, జనార్దన్ గౌడ్, ఆకుల నాగేశ్వర్ గౌడ్, సత్య గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు