న్యూయార్క్ : చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్టీట్ర్ జర్నల్ వెల్లడిరచింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్టీట్ర్ పేర్కొంది. అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడిరచారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా?లేదా? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది. క్విన్ గ్యాంగ్‌ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడిరచలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్‌పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని వాల్‌స్టీట్ర్ పేర్కొంది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడిరచింది.