- జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి..
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో అందులో బీసీల కోసం గళం వినిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డిని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేలా పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి తన వాయిస్ వినిపిస్తారనే గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు.. ఈ పార్లమెంట్ సెషన్స్ లో అయినా బీసీల కోరుకున్న వాటిపై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటనలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. పేదల పక్షపాతి, బీసీల కోసం ఇంతకు ముందు గళాన్ని వినిపించిన రంజిత్ రెడ్డి ఈ సారి కూడా పార్లమెంట్ లో తప్పకుండా బీసీల కోసం తన వాయిస్ ను వినిపిస్తారని ఆశిస్తూ ఉన్నామని దుండ్ర కుమారస్వామి అన్నారు.
కులగణన జరిగినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మే నాయకుల్లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఒకరని దుండ్ర కుమారస్వామి అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు 2021 జనాభా లెక్కల్లో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని.. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాలయాపన చేస్తోందని అన్నారు దుండ్ర కుమారస్వామి. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకు ఇవ్వాల్సినంత శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని.. రిజర్వేషన్ సాధన కోసం జాతీయ బీసీ దళ్ ఉద్యమిస్తూనే ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి బీసీల జనాభాకు తగినట్టు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో అయాన్, సుభాష్, మల్లేష్ కరుణాకర్ రెడ్డి, బీసీ నేతలు పాల్గొన్నారు..