Saturday, July 27, 2024

జిల్లా కలెక్టర్ గారు ఎంపికైన అభ్యర్థులకు అన్యాయం చేయకండి..

తప్పక చదవండి
  • సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ విజ్ఞాపన..

గత ఆరు నెలల క్రితం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లో అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ధరఖాస్తు చేసుకున్న వారందరికీ 3 సార్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. ఎంపీడీఓ, ఎమ్మార్వో, ప్రిన్సిపాల్ ఈ కమిటీ ద్వారా పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి జిల్లా కలెక్టర్, డీఈఓ లు ఎంపిక చేశారు. జూన్ 2న జిల్లా నుంచి ఎంపిక చేసిన లిస్ట్ వచ్చినదని అభ్యర్థులను కేజీబీవీ ప్రిన్సిపాల్ పిలిచి వారం రోజులుగా పనిచేయించుకున్నాక రాజకీయ నాయకుల జోక్యంతో పని బందు చేశారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళదామన్నా ఎవరినుంచి ఎలాంటి స్పందన లేదు.. ఒక సారి నోటిఫికేషన్ జారీ చేసి నియమించాక, వారిని కాదని రాజకీయ నాయకులు చెప్పిన పేర్లు ఎలా మళ్లీ ఎంపిక చేస్తారు. వారు ఏమైనా వారి ఇంటి పని మనుషులా..? ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పారదర్శకంగా ఎంపిక చేసిన మొదటి లిస్టులో ఉన్న వారినే విధులకు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు