- 10 రంగులు, 25 డిజైన్లు.. 240 వైరటీలు..
- ముందస్తు పంపిణీకి ప్రణాళికలు..
- కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
హైదరాబాద్ : ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపించి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన బిపిఎల్ మహిళలందరికీ ఉచితంగా చీరలు అందిస్తున్నది. ఈ ఏడాది 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కోటి చీరలు ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. అక్టోబర్ లో బతుకమ్మ ఉత్సవాలు మొదలుకానుండగా బతుకమ్మ పండగ వరకు లబ్ధిదారులకు అందించాలని లక్ష్యం విధించుకుంది. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోబతుకమ్మ చీరాల తయారీ ఊపందుకుంది. 10 రకాల రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీల్లో చీరలు తయారవుతున్నాయి.. ప్రభుత్వం 350 కోట్ల రూపాయల విలువైన కోటి చీరలు ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా ఉత్పత్తి వడివడిగా, పండుగలా సాగుతున్నది. ఇప్పటికే దాదాపు 30 లక్షల పైగా చీరలు ఉత్పత్తి పూర్తయి ప్రాసెసింగ్ కాగా, ఆ వెంటనే చేనేత జౌళి శాఖ యంత్రాంగం జిల్లాలకు తరలిస్తున్నది. వచ్చే బతుకమ్మ వేడుకలు మొదలు కానుండగా ఆలోపే బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు జౌలిశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు5 కోట్ల 50 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా 30 లక్షల పైగానే చీరలు తయారు కాగా సిరిసిల్లలోని రెండు, హైదరాబాదులోని కాటేదాన్ లో ఉన్న 9యూనిట్లకు పంపించారు. ప్రాసెసింగ్ అయినా చీరలు వెనువెంటనే ప్యాకింగ్ చేసి జిల్లాలకు తరలించేలా టెస్కో సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. గత వారం నుంచే తరలిస్తుండగా అక్టోబర్ నాటికి మొత్తం ఈ ప్రక్రియను ముగించనున్నారు. బతుకమ్మ చీరల తయారీలో వేలాది మందికి చేతినిండా పని దొరుకుతుంది. దాదాపుగా 15000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేత కార్మికులతో పాటు వైపని వార్పిన్ కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆటో కార్మికులు, గుమస్తాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు.