Saturday, July 27, 2024

సామాజిక న్యాయ సాధనే బాపూజీ లక్ష్యం

తప్పక చదవండి

భారత స్వాతంత్ర సమర యోధుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీమంత్రి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు పొందిన మహానేత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ. పోరాటం, సాహసం, ధైర్యం, పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనాదక్షత, ప్రజాహిత సేవ, విలక్షణమైన నాయకత్వ లక్షణాలు గల సమ్మేళనమే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్వాతంత్ర సమర స్ఫూర్తి గల ఆయన పెత్తందారి, దోపిడి సామా జిక వ్యవస్థ పై తిరుగుబాటు చేశాడు. దోపిడీకి గురవుతు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడు. క్విట్‌ ఇండియా ఉద్యమంకు అనుగుణంగా హైదరాబాదులో సత్యాగ్రహ కార్యక్ర మాలు నిర్వహిస్తూ, హైదరాబాద్‌ రాష్ట్రం భారత దేశంలో విలీనం కావాలని ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప ధైర్యశాలి. ఆ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నందుకు కు 13 సార్లు అరెస్ట్‌ వారెంట్లు నాటి ప్రభుత్వం జారీ చేసినా భయపడలేదు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1915 సెప్టెంబర్‌ 27న కనీస సౌకర్యాలు లేని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని, (ప్రస్తుతం తెలం గాణ) గిరిజన ప్రాంతమైన పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా (ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్‌) లోని వాంకిడి గ్రామం లో పద్మశాలి సామాజిక వర్గంలో జన్మించాడు. తన మూడు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. రాజు రామ ఘర్‌ లో బాల్యము గడిపిన ఆయన ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్‌ లో, తన 20వ ఏట మిడిల్‌ స్కూల్‌ పాసై, 23 వ సంవత్సరం మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యాడు. 25వ ఏట హైదరాబాదులో న్యాయ వాద కోర్సు పాసై న అనంతరం 1945 లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తన జీవిత భాగస్వామి డాక్టర్‌ కొండ శకుంతలాదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తన కుమారుడు ఒకరు భారత వైమానిక దళంలో ఉంటూ దేశ సేవలో వీర మరణం పొందాడు. హైదరాబాదులోని సచివాల యానికి సమీపంలో హుస్సేన్‌ సాగర్‌ తీరాన (ప్రస్తుతం నెక్లెస్‌ రోడ్‌) భూమి కొని జలదృశ్యం అనే పేరుతో గృహం నిర్మించుకొని అందులో నివసించే వాడు. కానీ 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా, కోర్టుకు వెళ్లిన ఆయనకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. అతని అంత్యక్రియలు సైతం సెప్టెంబర్‌ 21, 2012లో జలదృశ్యంలోనే జరిగాయి. స్వాతంత్రోద్యమ కాలంలో 1941లో మహాత్మా గాంధీతో కలిసి, ఆయన అడుగు జాడల్లో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్‌ సంస్థానం నిజాం ప్రభువు ఆధీనం లో ఉన్న క్రమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1947 -48 మధ్యకాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1947 డిసెంబర్‌ 4న నిజాం నవాబు మీద బాంబు విసిరిన నారాయణ రావు పవార్‌ బృందంలో లక్ష్మణ్‌ బాపూజీ కూడా నిందితుడు. అజ్ఞాతంలో ఉండి తన ప్రాణాలు కాపాడుకు న్నాడు. 1952-69 మధ్య కాలంలో జరిగిన నాన్‌ ముల్కీ ఆందో ళనలో పాల్గొన్నారు. రాజకీయ జీవితం -కీలకపాత్ర.. ఆనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పై ప్రభుత్వం విధించిన నిర్బంధం తొలగించిన తర్వాత 1945 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1952 వ సంవత్సరం లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో అదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. 1957 లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు కావడం వల్ల, పద్మశాలి సామాజిక వర్గం అధికంగా ఉన్న నల్గొండ జిల్లా కు, మారి 1957లో చిన్న కొండూరు, (ప్రస్తుతం భువనగిరి) నియోజకవర్గం నుండి గెలిచి 1957-60 మధ్యకాలంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత 1960-62 మధ్యకాలంలో దామో దరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్‌, లఘు పరిశ్రమలు, చేనేత, టెక్స్టైల్‌ శాఖ మంత్రిగా, పదవులు నిర్వహించి ఆ శాఖ లకు వన్నె తెచ్చాడు. 1967-69 కాలంలో కాసు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిత్వం లో కార్మిక మరియు సమాచార శాఖ మంత్రిగా రెండు పర్యాయములు కేబినెట్‌ మంత్రిగా ప్రశంసనీయమైన పదవులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్‌. 1962లో మునుగోడు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా విఫలమ య్యాడు. కానీ 1967-72, 1972-78 వరకు రెండు సార్లు భువనగిరి అసెంబ్లీకి ఎన్నిక య్యాడు. నాడు రాష్ట్రంలో ముఖ్య మంత్రి ఎంపిక సమస్య వచ్చిన ప్పుడు కూడా దామోదరం సంజీవ య్యని అభ్యర్థిగా నియమిం చడంలో తన స్వగృహ మైన జలదృ శ్యంలో సమా వేశమైనప్పుడు సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించడంలో తన పాత్ర ముఖ్యమైనది. నిమ్న వర్గాలకు, అన్యాయాలను, వ్యతిరేకతను ఎదుర్కొని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినీ, ముఖ్య మంత్రిగా చేయడం అనేది దేశంలోనే చారిత్రక సంఘటనగా చెప్పవచ్చును. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ,1969 మార్చి 27న తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పదవి అవకాశాన్ని దిక్కరించి తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప తెలంగాణ వాదిగా చెప్పవచ్చును. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో తెలం గాణ సాధన సమితి లో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ, నవంబర్‌ 2, 2008 న తెలంగాణ రాష్ట్ర హోదా కావాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ధైర్యము, పట్టు వదలకుండా నాలుగు దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కే నిత్యం శ్రమించిన వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ.
` కామిడి సతీష్‌ రెడ్డీ 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు