Saturday, November 2, 2024
spot_img

కుటుంబ సభ్యులతో సహా మోడీని కలిసిన బండి సంజయ్..

తప్పక చదవండి
  • బండిని అభినందించిన ప్రధాని..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు