Sunday, October 6, 2024
spot_img

ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అలుకోబాండ్రంగులు, సర్ఫేసెస్ శ్రేణిని ప్రారంభించిన 3 ఏ కాంపోజిట్స్..

తప్పక చదవండి
  • వినూత్న శ్రేణిని ప్రారంభించడం అలుకోబాండ్ రంగులు, సర్ఫేసెస్ పోర్ట్‌ఫోలియోను బలపరుస్తుంది..

గ్లోబల్ ఇన్నోవేటర్, హై-క్వాలిటీ అల్యూమినియం కాంపోజిట్ మెటీరియల్స్ తయారీదారు, స్విస్ అగ్రగామి సంస్థ అయిన 3ఏ కాంపోజిట్స్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అలుకోబాండ్ తన ప్రీమియర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి ప్రత్యేక, క్లాసిక్ శ్రేణి రంగులు, సర్ఫేసెస్ ను ప్రారంభించింది. మూడు కొత్త ఉత్పాదనలు : కలర్ స్కేప్స్, కాంక్రీట్, గ్రోవ్.
ఈ మూడు సిరీస్‌ల జోడింపుతో, అలుకోబాండ్ ఎంచుకోవడానికి 40 కంటే ఎక్కువ రంగుల కొత్త ఆకర్షణీయమైన పోర్ట్‌ఫోలియోను అందించింది. ఈ మూడు సిరీస్‌లతో దీర్ఘకాల నిర్మాణ ఉపయోగం కోసం ఉత్తమ ఉపరితల పూత, రంగులను పరిచయం చేస్తూ, అలుకోబాండ్ ఆర్కిటెక్ట్‌లకు వారి డిజైన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపును అందించడానికి వీలు కల్పించింది. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణమవుతున్న ప్రీమియం వాణిజ్య, నివాస భవనాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ లేదా సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుతం, కంపెనీ తన అంకితమైన, బాగా స్థిరపడిన సేల్స్ నెట్‌వర్క్ ద్వారా భారతదేశంలోని ప్రధాన మార్కెట్‌లలోని ఆర్కిటెక్ట్‌లు, డెవలపర్లు, ఫ్యాబ్రికేటర్‌లను లక్ష్యంగా చేసుకుంటోంది. 3 ఏ కాంపోజిట్స్ 2007లో స్థాపించబడిన పూణే సమీపంలోని తన సొంత అత్యాధునిక కేంద్రంలో ఏసీపీ మెటీరియల్‌లను తయారు చేస్తోంది, ఇది ప్రధానమంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో సంపూర్ణంగా ఏకీభవిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి 3 ఏ కాంపోజిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ శ్రీరంజీత్ శర్మ మాట్లాడుతూ, “ఏసీపీని ఇన్‌స్టాల్ చేసే విషయంలో మా ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అలుకోబాండ్ ఎల్లప్పుడూ ఆర్కిటెక్ట్‌ల ప్రాధాన్యత ఎంపికగా ఉంటోంది. ఆర్కిటెక్ట్‌లు సేఫ్‌ఫైర్-రిటార్డెంట్ మెటీరియల్‌లతో ఆధునిక, శైలీకృత భవనాల కోసం వారి అత్యుత్తమ సృజనాత్మకతను వెలికితీసేందుకు, మేం ఇప్పటికే ఉన్న మా పోర్ట్‌ఫోలియోలో మూడు కొత్త రంగుల సిరీస్‌లను పరిచయం చేశాం. ఇది డిజైనింగ్ ట్రెండ్‌లో కొత్త తరంగాన్ని తెస్తుంది, ఆర్కిటెక్ట్‌లు భద్రతతో కూడిన డిజైనింగ్ చక్కదనం సాధించడంలో సహాయపడుతుంది’’ అని అ న్నారు. 3 ఏ కాంపోజిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, మార్కెటింగ్ హెడ్ అమర్ కిరాలేఈ కొత్త రంగుల శ్రేణిని పూర్తిగా అసాధారణమైనదిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సబ్ డ్యూడ్మొదలుకొని బోల్డ్, బ్రిలియంట్ వరకు, జాగ్రత్తగా రూపొందించబడిన ఈ రంగుల శ్రేణి ఆర్కిటెక్ట్‌ల సృజనాత్మకతను శక్తివంతం చేస్తుంది, వారి డిజైన్‌లకు అద్భుతమైన ప్రభావాలను తీసుకురావడంలో సహాయపడుతుంది. మెటాలిక్, సాలిడ్, వైబ్రెంట్ రంగుల సరైన కలయికతో, ఆర్కిటె క్చర్ లోని కొన్ని అంశాలను నొక్కి చెప్పవచ్చు. ఇది డిజైన్‌లలోని ముఖ్య ప్రాంతాలలోని నిర్దిష్ట అంశాలను హైలైట్ చేయడానికి ఆర్కిటెక్ట్‌లకు సౌలభ్యాన్ని ఇస్తుంది’’ అని అన్నారు. ‘కలర్ స్కేప్స్’శ్రేణికి చెందినమెటాలిక్, సాలిడ్ కలర్స్, సర్ఫేసెస్ తో, ఆర్కిటెక్ట్ లు వారి శైలి డిజైన్‌లను రూపొందించడానికి కలర్స్ పాలెట్‌ను ఉపయోగించగలుగుతారు. అల్యూమినియం కాంపోజిట్ మెటీరియల్‌లో కాంక్రీట్ సారూప్య రూపాన్ని అనుకరిస్తూ, అలుకోబాండ్ ‘కాంక్రీట్’ షేడ్స్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది.. వీటిని ప్రధానంగా ఫకేడ్ క్లాడింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. చెక్క మూలతత్వాన్ని ముందుకు తీసుకువస్తూ, అలుకోబాండ్ ‘గ్రూవ్’ అనే ప్రత్యేక సిరీస్‌ను ప్రవేశపెట్టింది.. ఇది ఫంగస్ నాచు లేదా తెగులు గురించి చింతించకుండా సహజ కలపకు బదులుగా అల్యూమినియం మిశ్రమ పదార్థాన్ని ఉపయోగించడానికి డిజైనర్‌కు వీలు కల్పిస్తుంది.

భారతదేశంలో, అలుకోబాండ్ దాదాపు 25 విమానాశ్రయాలు, మరెన్నో ఐఐటీలు వంటి ప్రధాన విద్యాసంస్థలు, వందలాది ప్రధాన పెట్రోల్ పంపులు, న్యూదిల్లీలోని ప్రధాన మెట్రో స్టేషన్లు మొదలైన అనేక కట్టడాల నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించబడింది. సబర్మతి హై-స్పీడ్ రైల్ టెర్మినల్, నిర్మాణంలో ఉన్న భారతదేశపు అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన న్యూదిల్లీలోని ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్, జియో కన్వెన్షన్ సెంటర్, ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మొదలైనవి అలుకోబాండ్ ఉపయోగించిన ఇటీవలి ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లలో కొన్ని.

- Advertisement -

శర్మ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు, దేశవ్యాప్తంగా ప్రీమియం ఆర్కిటెక్చరల్ విభాగంలో 130 మిలియన్ చ.అ.ల కంటే ఎక్కువ అలుకోబాండ్ ఏసీపీ ఉపయోగించబడింది. 1995లో అలుకోబాండ్ భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడినప్పుడు, కొత్త నిర్మాణ సామగ్రిగా అది భారతీయ మార్కెట్లలో ఒక సంచలనాన్ని సృష్టించింది.. ముంబై వంటి నగరంలో అనేక భవనాలు ఉన్నాయి;ఉదాహరణకు, సిటీ బ్యాంక్, ఐ.ఎల్. అండ్ ఎఫ్.ఎస్., ఎన్.ఎస్.ఈ., భారత్ డైమండ్ బోర్సీన్ బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ నిర్మాణం సందర్భంగా 1990ల చివరలో, 2000ల మొదట్లోఇక్కడ అలుకోబాండ్ ఉపయోగించబడింది. ఆ భవనాలు ఇప్పటికీ వాటి ముఖభాగాలను చెక్కుచెదరకుండా కలిగి ఉన్నాయి.. ఇది ప్రపంచ నాణ్యతకు నిదర్శనం. ఇది ఒక నిర్మాణ విప్లవాన్ని సృష్టించింది, ఒక కొత్త నమూనాను ఏర్పరిచింది’’ అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు