Saturday, May 11, 2024

తెలంగాణ బిజెపి బలోపేతం కోసం బండి కృషి మరువలేనిది..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ అన్న కృషి మరువలేనిది. ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం మరియు గ్రామస్థాయి నుండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్య ఉన్నది అంటే అక్కడ వాలిపోయి అండగా నిలబడే మనస్తత్వం గల మనిషి పార్టీ కార్యక్రమాలు మరియు ప్రతి కార్యకర్త కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న నేత రాష్ట్రవ్యాప్తంగా విస్తరంగా తిరిగి ప్రతి గ్రామానికి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లడంలో సంజయ్ అన్న కృషి ఎనలేనిది. కుటుంబానికి దూరంగా ఉంటూ దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడ్డ నాయకుడు చిన్నతనం నుండే విద్యాభ్యాసం శిశు మందిర్ లో చదివి హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తి పోరాడిన వాడు కరీంనగర్ లో ఎన్నో దాడులకు తట్టుకొని నిలబడి నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను పట్టించుకోకుండా పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ పోవడం తన నైజం కాబట్టి గౌరవ పార్టీ పెద్దలు ఏ పదవి ఇచ్చిన ఆ పని చేసుకుంటూ వెళ్లిపోవడమే బండి సంజయ్ సిద్ధాంతం పార్టీకి కార్యకర్తగా పనిచేయడమే తనకు ఇష్టం అని ఎన్నోసార్లు సభలలో చెప్పారు. కరీంనగర్ కౌన్సిలర్ గా తన రాజకీయ పదవిని ప్రారంభించి పార్లమెంట్ కి ఎన్నిక కావడం మరియు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని బలోపేతం చేయడంలో బండి కృషి మరువ లేనిది. తనే ముందు ఉండి సమస్యల మీద పోరాడే పటిమ మరియు అనేకసార్లు ప్రజల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కొట్లాడి కరీంనగర్ జైలుకి పాలుమార్లు పోయిన కూడా బండి దూకుడు తగ్గనివ్వలే కుటుంబం కంటే పార్టీ ముఖ్యం సిద్ధాంతం ముఖ్యమని తన కుటుంబాన్ని పిల్లలను దూరం ఉన్న నమ్మిన సిద్ధాంతం కోసం కొట్లాడిన బండికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరియు రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించిన కూడా తను ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్న పార్టీకి కట్టుబడి ఉంటా అని అసలు ఆ విషయమే పట్టించుకోకుండా కరీంనగర్ నుండి వరంగల్ కి నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రైల్వే మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపి అభివృద్ధి పైన చర్చలు జరిపి గౌరవ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో పార్టీ అధికారం కోసం కార్యకర్తగా పనిచేస్తాయని చెప్పడం బండి సంజయ్ గారికి పార్టీ మీద ఎంత గౌరవం ఉన్నదో తెలుస్తుంది. మరియు ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన బండి సంజయ్ కి భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకొని తన భుజాల పైన ఎత్తుకొని మరి స్వాగతం పలికారు తెలంగాణలో ఆరుగుడుగు పెట్టిన సంజయ్ అన్న నూతనంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గౌరవ కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి కరీంనగర్ చేరుకున్న బండి తనుకు ఎంతో ఇష్టమైన మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకుని గజ్వేల్ నియోజకవర్గం లో శివాజీ విగ్రహం మీద అసభ్యకరంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా కార్యకలాపాలు చేసిన వారిని ప్రతిఘటించి అడ్డుకున్న వారిని కరీంనగర్ జైల్లో వేస్తే వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు శివాజీ మరియు మహనీయుల ఏ విగ్రహం అయినా ఇలాంటి సంఘటనలు చేస్తే చూస్తూ ఊరుకోమని సవాలు విసిరారు.. ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడేతనం బండి కి అలవాటు ప్రజాసంగ్రామ యాత్రలో పార్టీ ఎంతగానో గ్రామస్థాయి నుండి పట్టణం వరకు తెలంగాణలో గడపగడపకు బలంగా తయారైంది. చిన్నపిల్లలు పెద్దలు ముసలి వాళ్లు మహిళలు సైతం బండికి బలమై నడిచారు. ఎంతగా అభిమానం పెరిగింది అంటే బండి కోసం అవసరమైతే ప్రాణాలు తీసుకునే అంతా అభిమానం బండి సంజయ్ సంపాదించుకున్నారు. వాస్తవంగా పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించిన తర్వాత చాలామంది అభిమానులు ఆత్మహత్యలకు సిద్ధమయ్యారు అంటే బండి స్తాయి తెలంగాణలో చాలా బలంగా తయారైంది. ఒక కార్యకర్త ఆత్మ హత్య యత్నం చేసిన తర్వాత తన వెంట నడిచిన బలగంకి ఎప్పుడు బండి సంజయ్ అన్న కోసం తిరిగే కొంతమంది కార్యకర్తలకు ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరి బండి సంజయ్ ధైర్యం చెప్పారు పదవులు కాదు ముఖ్యం మనం అందరం కార్యకర్తలం పార్టీ అధికారంలోకి రావడానికి మనం పని చేయాలి ఎవరు ఆదర్యపడవద్దు. నేను బిజెపి కార్యకర్తగా సంతోషంగా ఉన్నా పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగా పని చేద్దాం అని ధైర్యం చెప్పారు కాబట్టి అభిమానులు కొంత ధైర్యం లో ఉన్నారు ఆత్మహత్యలు ఆందోళనకు వెనుకకు తిరిగారు. బండి మాటలు తనను నమ్ముకున్న వారిని సంతోషంగా ఉంచి అతనే ముందు ఉండేలా ఉంటాయి అనేకసార్లు ధర్నాలో రాస్తారోకోలు కూడా బండి ముందు ఉండి జైలుకుపోయిన సంఘటనలు ఎన్నో బండి సంజయ్ ని అభిమానించే కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉన్నారు. తెలంగాణ లో ఉప ఎన్నికలలో పార్టీ విజయం మరియు కీలకమైన నేతలు పార్టీ లో చేరికలు భారీ స్థాయిలో జరిగాయి తెలంగాణ లో బీజేపీ చాలా వరకు బలంగా తయారైంది బండి సంజయ్ నాయకత్వం లో అనేక మంది కార్యకర్తలు తన వెంట నడవడం కోసం సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా బండికి బలమై పని చేయడానికి కార్యకర్తలు బలం పెద్ద సంఖ్యలో ఉన్నది. ఒక పిలుపు ఇస్తే లక్షల సంఖ్యలో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం. సొంత పైసలు ఖర్చు పెట్టుకుని మరీ బండి సంజయ్ అన్న వెంట నడవడానికి ఎంతో మంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో పార్టీ కోసం బండి కోసం కష్టపడుతాం. కార్యకర్తగా ఉన్న పెద్దలు ఏదైనా పదవి ఇచ్చినా బండి సంజయ్ అన్న తప్పకుండా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే శ్రామికుడు కాబట్టి ఆ మహాశక్తి అమ్మవారి దయవలన ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ప్రజలకు ఇంకా ఎక్కువగా సేవ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు..

  • జోగినపల్లి శ్రీనివాస్ గౌడ్, (దుబాయ్ శ్రీను), బీజేపీ నాయకులు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు