ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో తక్కువ బంతుల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్(Ashes Series) మూడో టెస్టులో అతను ఈ ఫీట్ సాధించాడు. 24 ఏళ్ల బ్రూక్ 1,058 బంతుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం. పదో టెస్టు ఆడుతున్న బ్రూక్ 16వ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. అయితే.. మ్యాచ్‌ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ వేగంగా వెయ్యి పరుగులు బాదాడు. అతను 7 టెస్టుల్లోనే వెయ్యి క్లబ్‌లో చేరాడు.