Saturday, July 20, 2024

అమరవీరుల గన్ పార్క్ స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన బక్క జడ్సన్..

తప్పక చదవండి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని శనివారం రోజు తెలంగాణ ఉద్యమ అమరుల స్థూపాన్ని పాలతో ఏ.ఐ.సి.సి. సభ్యులు, రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ శుద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కన్న తల్లిలా చలించిపోయిన నాటి యుపిఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని త్యాగాలు చేస్తే వారి త్యాగాలను వమ్ము చేసి అమరుల ఆశయాలకు తూట్లు పొడిచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల గన్ పార్క్ స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని నిరసిస్తూ పాలతో శుద్ధి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్, టి.ఆర్.ఎస్.పార్టీని విలీనం చేస్తానని, రాష్ట్రం కోసం కేసీఆర్ గొంగళి పురుగునైన ముద్దాడతానని మాయమాటలు చెప్పి, తెలంగాణ రాష్ట్ర ప్రకటించిన వెంటనే సోనియా గాంధీని, కేసీఆర్ కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కలిసి నమ్మించి.. రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని, నమ్మించి మాట తప్పి దళితులకు చెందిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూ 1.15 లక్షల కోట్ల నిధులను దారి మళ్లించి కల్యాణ లక్ష్మి, నూతన రెసిడెన్షియల్ స్కూల్స్, ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్, ఆసరా పెన్షన్లకు, త్రాగునీటికి, కెసిఆర్ కిట్స్, హాస్టల్లో సన్న బియ్యం, ఎన్నికల కోసం రైతుబంధు తదితర వాటికి దారి మళ్ళించారని బక్క జడ్సన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, సకల జనులు రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబమే 9 ఏండ్ల పరిపాలనలో కుటుంబ సమేతంగా శాఖల వారీగా విభజించుకుని 4.20 లక్షల అప్పులు చేసి కాలేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి పేరుతో, నిధులు, అసైన్డ్, పట్టా భూముల స్వాహా, డ్రగ్స్, గుట్కా, గంజాయి, అక్రమ మద్యంతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కేసీఆర్ కుటుంబం దోచుకున్నారని.. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఉద్యమకారులను, ఉద్యమ అమరులను విస్మరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించేందుకే సీఎం కేసీఆర్ గన్ పార్క్ స్తూపం వద్ద నివాళులర్పించారని.. సీఎం కెసిఆర్ నైతిక హక్కు కోల్పోయారని అమరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని జడ్సన్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని.. నిరుద్యోగ యువతకు చట్టంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర అంశాల అమలులో బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం విఫలం చెందారని 9 ఏండ్ల నాటి నుండి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం పేదలపై మోపిన భారాన్ని బడ్జెట్లో అన్నింటికీ పచ్చ జెండా ఊపి.. నేడు టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ వైరుధ్యం ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మాయ చేసి మరోసారి మోసం చేయుటకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని, కెసిఆర్ పదేండ్ల ప్రభుత్వంలో చేసిన అప్పులను చూస్తేనే ప్రజలపై భారం ఎంత మోపారో అర్థమవుతుందని కేసీఆర్ వైఫల్యాలను అంశాల వారీగా ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని, రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వారి కుటుంబ అవినీతి అక్రమాలపై ప్రజాక్షేత్రంలో వసూలు చేస్తామని బక్క జడ్సన్ అన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువకులను మోసం చేస్తూ.. ఉద్యోగ నియామకాల పేపర్ల లీకేజ్ లు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకాని పెడుతూ, తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని పేర్కొంటూ గన్ పార్క్ స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పిస్తూ పాలతో స్థూపాన్ని బక్క జడ్సన్ శుద్ధి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు