హైదరాబాద్ :శనివారం రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ ని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో హార్టికల్చర్, పబ్లిక్ గార్డెన్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగుల, అధికారుల పాత్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేశారని కొనియాడాడు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, విజయ ప్రసాద్, రాధాకృష్ణ, వేణుగోపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.