Saturday, July 27, 2024

కమ్ముకొస్తున్నయుద్ధ మేఘాలు..!

తప్పక చదవండి

అజర్‌బైజన్‌-అర్మేనియా మధ్య మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఈ సారి కూడా నాగర్నో-కారబఖ్‌ ప్రాంతమే వీరి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతంలో అజర్‌బైజన్‌ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 100 మంది మరణించారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మంగళవారం మొదలైన ఈ ఆపరేషన్‌ బుధవారం కూడా కొనసాగింది.నాగర్నోకారబఖ్‌ నుంచి అర్మేనియన్లను వెళ్లగొట్టేందుకు ఈ దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ, అజర్‌బైజన్‌ మాత్రం దీనిని ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా చెబుతోంది. అక్కడ ఉన్న అర్మేనియన్‌ జాతీయుల హక్కులను రక్షించేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామని చెబుతోంది. రష్యాకు చెందిన శాంతి పరిరక్షక దళాలు ఇక్కడి నుంచి 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడిరచింది. 2020 నాటి ఒప్పందానికి తక్షణమే కట్టుబడి ఉండాలని రష్యా పిలుపునిచ్చింది. ‘తైప్రాక్షిక ఒప్పందానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ ఒప్పందంలో నాగర్నోకారబఖ్‌లో శాంతికి అవసరమైన అన్ని ప్రమాణాలను ప్రస్తావించారు‘ అని రష్యా విదేశీ వ్యహారాలశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘర్షణల్లో గాయపడిన వారికి శాంతి పరిరక్షణ దళాలు తక్షణమే వైద్యసాయం అందించాలని సూచించింది.మరో వైపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సెప్టెంబర్‌ 21న ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అర్మేనియా కోరింది. నాగర్నో-కారబఖ్‌లో అర్మేనియా దళాలు ఆయుధాలు వదిలిస్తే.. తాము ఆపరేషన్‌ నిలిపివేస్తామని అజర్‌బైజన్‌ అధ్యక్షుడు వెల్లడిరచారు. యుద్ధం విరమించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పిలుపునకు స్పందనగా ఈ ప్రకటన విడుదల చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు