Wednesday, September 11, 2024
spot_img

మణిపూర్ ఘటనపై అమిత్ షా వ్యాఖ్యలు..

తప్పక చదవండి
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి..
  • విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కుట్రను తేల్చాల్సి ఉందన్నారు. మణిపూర్‌ హింసాత్మక ఘటనలు.. మహిళల నగ్న ఊరేగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదించిన అఫిడవిట్‌లోని అంశాలను అమిత్‌ షా మీడియాకు తెలిపారు.

తాజాగా మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు.. మే 4 వ తేదీన కుకీ మహిళలపై జరిగిన అత్యంత అమానవీయ ఘటనపైనా అమిత్ షా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశామని.. వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని.. దీని వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మణిపూర్‌ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు 2022లో మయన్మార్‌లో జరిగిన సంఘటనలకు సంబంధించిన 2 వీడియోలను వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై మణిపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు