Monday, May 6, 2024

కేటీఆర్ దృష్టికి ఉప్పల్ నియోజక వర్గం సమస్యలు..

తప్పక చదవండి
  • కాలనీ వాసులతో కలిసి కేటీఆర్ ను కలిసిన
    మాజీ మేయర్ బొంతు రామ్మోహన్..
  • పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేత..
  • సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్..

ఉప్పల్ నియోజక వర్గం లోని పలు డివిజన్ లలో పేరుకుపోయిన పలు సమస్యలు తీర్చాలని కోరుతూ మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, నియోజవర్గ ప్రజలతో కలిసి రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిసి వినతి పత్రం సమర్పించారు.. పలు సమస్యలను ఆయన తన వినతి పత్రంలో తెలియపరిచారు..

ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీలో మాజీ సైనికులకు కేటాయించిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ల ప్రస్తావన.. ఉప్పల్ డివిజన్ లో దేవేందర్ నగర్ కాలనీ అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన గృహాలకు లోన్ల మాఫీ గురించి.. లక్ష్మి నరసింహ కాలనీనీ ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని కోరారు.. కేటీఆర్ నగర్ ను గతంలో ఉప్పల్ భగాయత్ లే ఔట్ లో చేర్చుతు హెచ్.ఎం.డీ.ఏ. సంస్థ నోటిఫై చేసి, అనంతరం దానిని భగాయత్ లో అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఇప్పుడు దానిని హెచ్.ఎం.డీ.ఏ. నుంచి డి నోటిఫై చేయాలని కోరారు.. రామాంతపూర్ డివిజన్ లోని కేసీఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.. మీర్ పేట్ హెచ్.బి.కాలనీ డివిజన్ డైమండ్ కాలనీని రిక్రియేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలి.. చిల్కా నగర్ డివిజన్ నార్త్ కళ్యాణ్ పురి కాలనీని ఓపెన్ స్పేస్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు బొంతు రామ్మోహన్..

- Advertisement -

గతంలో ఎల్బి నగర్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశాల మేరకు తగిన పరిష్కారం చూపించడం జరిగందని, కాబట్టి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కూడా పైన పేర్కొన్న అంశాలు ఆ జాబితాలోకి వస్తాయని రామ్మోహన్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మున్సిపల్, పరిశ్రమల శాఖ ఆధికారులను ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చిల్కా నగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు గొల్లురి అంజయ్య, గంధం జ్యోత్స్న నాగేశ్వర్ రావు, మేకల హన్మంతు రెడ్డి, నాయకులు రేగళ్ళ సతీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు