ఓటరు అడుగు పడాలి అంటరానితనాన్ని
నిర్మూలించే వైపు.. ఎలాంటి విబేధాలు
లేని వ్యవస్థ వైపు.. ఎలాంటి ప్రలోబాలకు
లొంగని వైపు, ఎలాంటి ఏకవర్గ
అభిప్రాయం లేని వైపు, వ్యవస్థలో మార్పు వైపు,
భవిష్యత్ తరాల అభివృద్ధి వైపు…
అలాంటప్పుడే గాంధీజీ కలలు కన్న
దేశ నిర్మాణం సాధ్యం..
అంబేడ్కర్ మహాశయుడి రాజ్యాంగానికి
రూపమిచ్చిన వారము అవుతాము.
గుర్తు పెట్టుకోండి ఒక లక్ష రూపాయల జీతం
ఉన్నవారు కూడా పీల్చడానికి గాలి..
లేవగానే తాగడానికి పాలు..
కలుషితం కాకుండా ఉండాలంటే
ఒక మంచి నాయకుడిని
ఎన్నుకోవడం నీ బాధ్యత..
ప్రశాంత్ పీ.