దొర నేలను చూసే సమయం దగ్గర పడ్డది..
మందు పెట్టె మాటలతో మళ్ళీ మీ ముందుకొస్తడు..
అడ్డమైన హామీలిచ్చి ఇసుక నుంచి తైలం తీస్తడు…
కుందేటి కొమ్ము నేను మాత్రమే తెస్తనంటడు..
ఆదమరిచి ఉంటిరా.. ఓటునమ్ముకుంటిరా…
నమ్మి చేరదీస్తిరా.. శునకం కూడా మనల్ని చూసి అంటది…
నా బతుకే బాగుంది కదా.. అని..
- కాతరాజు శంకర్