- ఆస్పత్రులు, కార్యాలయాల్లో సోదాలు
- కామినేని గ్రూపులపై ఈడీ దాడులు
- మెడికల్ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా
- రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు
- హైదరాబాద్ నుంచి బయలుదేరిన 11 బృందాలు
- సుదీర్ఘంగా సోదాలు చేసే అవకాశం..?
హైదరాబాద్, హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్‌ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. బుధవారం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాజాగా కామినేని గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి. అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే.. ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు రెండు టీమ్స్‌గా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఈడి అధికారుల సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయి. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. షామీర్ పేటలోని మెడిసిటీ కళాశాల ఏరియాలో అధికారులు దాడులు చేస్తున్నారు. ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు టీంలుగా విడిపోయి మరీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట ఉన్నాయి. భాగ్యనగరంతో పాటు నల్లొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్ ప్రెస్ వే, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్, శామీర్ పేట వైపు ఈడీ బృందాలు వెళ్లినట్లు తెలుస్తున్నాయి.. భారీగా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడి అభియోగంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో భారీగ అవకతవకలు జరిగాయని మరి ముఖ్యంగా ఫీజుల వసూళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సంస్థలు రూ.12వేల కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట ఐటీ అధికారులు తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మెడికల్ సీట్ల కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున నగదు తీసుకున్నారని.. వాటిపై దర్యాప్తు చేయాలని ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకూ ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐటీ అధికారులు రాసిన లేఖల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే.. ముంపై బీఎంసీ స్కామ్ ఆధారాంగా అన్నది తెలియాల్సి ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో.. సుదీర్ఘంగా సోదాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.