పెంచిన కూరగాయల ధరలు వెంటనే తగ్గించాలి : కాట సుధా శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరిగిన కూరగాయల ధరలను వ్యతిరేకిస్తూ పటాన్ చెరు పట్టణంలోని, బండ్లగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ జయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కూరగాయల ధరలను పెంచుతూ ప్రజలను మరింత కష్టపెడుతున్నారని మండి పడ్డారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు.