Saturday, June 15, 2024

క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో 77వస్వాతంత్ర దినోత్సవ వేడుక

తప్పక చదవండి

హైదరాబాద్ : నల్గొండ జిల్లా, చందంపేట మండలం, గాగిల్లాపూర్ గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ముఖ్యఅతిథిగా సి.జే.ఎస్. అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేశారు.. దేశంలోని ప్రతి పౌరుడికి దేశం పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రేమ, సోదర భావం, సమానత్వం కలిగి ఉండాలని.. అప్పుడే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారు అసమానతలు లేకుండా అభివృద్ధిలో పురోగతిని సాధించి, ప్రపంచంలోనే దేశాన్ని మొదటి స్థానంలో నిలుపుటకు కృషి చేయవచ్చు అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రెవ. క్రిస్టఫర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండల్ రెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఆనందు, ఉపసర్పంచ్ భూపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, రేవ. ప్రసాద్, చిన్న వెంకటయ్య, శ్రీనయ్య, గంగయ్య, చెన్నకేశవులు, మొనయ్య, ఈశ్వరయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు