Wednesday, April 17, 2024

అందుబాటులో లేని 108 అంబులెన్స్‌

తప్పక చదవండి

మిర్యాలగూడ : 108అంబులెన్స్‌ లు అందుబాటులో లేక ఉమ్మడి వేములపల్లి, మాడుగులపల్లి మండలాల వాసులు ఇబ్బంది పడుతున్నారు. రెండు మండలాలలో 108 అంబులెన్స్‌ సెంటర్స్‌ లేక ప్రమాదాలు జరిగినప్పుడు పక్క మండలం తిప్పర్తి నుంచి అంబులెన్స్‌ లు వచ్చి క్షతగాత్రులను తరలించేవి. అత్యవసర వేళలో పక్క మండలం నుంచి 108 వచ్చే సరికి క్షత గాత్రుల తరలింపులో జాప్యం జరుగుతుంది. నెల రోజులు గా తిప్పర్తి మండల 108 అంబులెన్స్‌ కూడా అందుబాటు లేక పోవడంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రైవేట్‌ వాహనాల ద్వారా హాస్పిటల్‌ కి వెళ్తన్నారు. ఉన్నతధికారులు పట్టించుకోని 108 సేవలు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు