Friday, May 17, 2024

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు

తప్పక చదవండి
  • బుద్వేల్, రాజేంద్రనగర్‌లో భూమిని కేటాయిస్తూ జీవో విడుదల..
  • వారసత్వ కట్టడంగా పాత భవనం!

తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసిందిరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్, బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్‌ 55లో పేర్కొంది. కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్‌ భవనంగా పరిరక్షించాలని సర్కార్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు