Tuesday, June 25, 2024

నామకారణం ఎలా చేయాలి..?

తప్పక చదవండి

( శ్రీ రుద్రపీఠం, దేవముని దేవదైవజ్ఞ వారి విశ్లేషణాత్మక కథనం.. )

ఎన్నో నోములు నోచి, ఎందరో దేవతలకు మొక్కి పిల్లలకు జన్మ నివ్వడానికి తల్లిదండ్రులు పడే కష్టాలు ఇంత అంత అని చెప్పనలవి కాదు. హాస్పిటల్ లు, టెస్ట్ ట్యూబ్ బేబీలు, సెరోగసీలు ఇలా ఎన్నో పాట్లు పడి మనము జన్మనిచ్చిన పిల్లలకు మనము చక్కని నామకారణం చేయలేకపొతే, తల్లిదండ్రులుగా మనము మనవిధిని చక్కగా నిర్వహించలేక పోయినట్లయితే పిల్లవాడు అదృష్టవంతుడుకాక దూరదుష్టవంతుడై, దురలవాట్లకు అలవాటుపడి మన కలలనన్నింటిని నీళ్ల పాలు చేసినవాడవుతాడు.

- Advertisement -

మనిషికి గుర్తింపు నిచ్చేదే పేరు, మనిషి వ్యక్తిత్వానికి గుర్తింపును తెచ్చిపెట్టేది కూడా పేరే . అలాంటి పేరును తల్లిదండ్రులు తమ ఇష్టం వచ్చినట్లు పెట్టి పిల్లవాడిని దూరదుష్టవంతుడిని చేయకుండ వాడిని అదృష్టవంతుడిని చేసే అదృష్టంను కలిగించునటువంటి పేరుతో నామకారణం చేయడం ద్వారా అటు పిల్లవాడికి, ఇటు వాడి భవిష్యత్తును ఉజ్వలోజ్వలం చేసి వాడి జీవితానికి ఎంతో మేలు చేసిన వారము అవుతాము.. పిల్లవాడి పేరును పిల్లవాడిని అదృష్టవంతుణ్ణి చేయువిధంగా పెట్టాలా లేక వాడి ద్వారా తల్లికి అదృష్టకలసిరావాలా లేక తనచెప్పు చేతుల్లో ఉండేవిధంగా ఉండాలా, తండ్రికి అదృష్టమును చేకూర్చాలా లేక తండ్రికి అనుకూలంగా ఉండాలా అనేది మొదట నిర్ణయించుకోని పిల్లవాని నామకారణం చేయాలి.

ఎప్పుడైనా పిల్లవాని పేరును వాడి జన్మరాశిలోనైనా లేదా ఆ జన్మరాశి నుండి తొమ్మిదవస్థానమైన భాగ్యస్థానములోనైనా పెట్టిన వాడు అదృష్టవంతుడవుతాడు. చాలామంది పిల్లవాడు పుట్టిన జన్మరాశిలో పేరు పెట్టడానికి ఇష్టపడరు. చాలామంది పెట్టకూడదని కూడా అంటారు. అది చాలా చాలా తప్పు. ఎందుకనగా మన ముప్పది సంవత్సరముల జీవితచక్రములో శని రెండున్నర సంవత్సరాలు అర్దాష్టమశనిగాను, రెండున్నరసంవత్సరాలు అష్టమ శనిగాను, ఏడున్నరసంవత్సరాలు ఏలినటిశనిగాను ఇలా ముపై సంవత్సరములలో పన్నెండున్నర సంవత్సరములు ఉంటాడు. ఇంతే కాకుండా రాహు, కేతులు ఒక్కొక్కరాశిలో ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు. ఇలా ఒక్కొక్కరు జన్మరాశిలో ఒకసారి, నామరాశిలో ఒకసారి ఉండటం వలన జీవితాంతం శని, రాహు, కేతువుల మధ్యనే గడిచి పోతుంది. జీవితంలో దుఃఖములే కానీ సుఖం అనేదే ఉండదు. అందువలన పిల్లవాడి పేరును ఎప్పుడు జన్మరాశిలోనే పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమము.

ఏదైనా సందేహాల నివృత్తి కోసం.. శ్రీ రుద్రపీఠం, దేవముని దేవదైవజ్ఞ గారిని సంప్రదించవచ్చు : 9346053953..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు