Friday, May 17, 2024

హత్య సంఘటన వెనుక ఉన్న దోషులను శిక్షించాలి..

తప్పక చదవండి
  • రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య మిస్టరీని చేధించాలి..
  • భూకబ్జా కూనికోర్ గిరబోయిన అంజయ్య భార్య భాగ్యలక్ష్మిని జనగామ జెడ్.పీ. వైస్ చైర్మన్
    పదవి నుంచి బర్తరఫ్ చేసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నైతికతను నిరూపించుకోవాలి….
  • గంగరబోయిన సుభద్ర దారుణ హత్య విషయంలో జనగామ ఆసుపత్రి డాక్టర్స్ ఇచ్చిన తప్పుడు నివేదిక
    వెనక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్. సుగుణాకర్ రాజు పాత్ర ఉంది….
  • విలేకరుల సమావేశంలో వెల్లడించిన సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి..

ఇండియన్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారం డాక్టర్ సుగుణాకర్ రాజును జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ పదవిని నుండి తొలగించాలని,
గంగరబాయిన సుభద్ర పోస్టుమార్టం విషయంలో తప్పుడు పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చిన వైద్యుడు డాక్టర్ రాహుల్, డాక్టర్ ప్రదీప్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి డిమాండ్ చేస్తున్నారు..

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిన డాక్టర్ సుగుణాకర్ రాజును ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ఆయన నేటికీ విధుల నుంచి తొలగించకపోవడం చూస్తుంటే.. తెలంగాణ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి అలాగే హెల్త్ మినిస్టర్ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాత్ర ఈ వ్యవహారం వెనకాల ఉన్నట్టు అనిపిస్తుందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పాడుగుల దామోదర్ ఇచ్చిన ఫిర్యాదు పై గత నెలలో మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆయన అన్నారు.

- Advertisement -

గత నెల అక్టోబర్ మాసంలో బచ్చన్నపేట మండలం, సదాశివ పేట శివారులో హత్యకు గురికాబడ్డ గంగారబాయిన సుభద్ర పోస్టుమార్టం రిపోర్టులో అనేక తప్పులు జరిగాయని అన్నారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పోస్టుమార్టం చేశారని చెప్పడం.. సర్టిఫికెట్లు చూస్తే ఒక డాక్టర్ సంతకం ఉండడం.. వీటికి దేనికి పొంతనలేదని.. అలాగే మృతికి కారణం కూడా పోస్టుమార్టం రిపోర్ట్ లో రాయలేదని.. సదరు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ రాహుల్ శరీర అవయవాలు కుళ్ళిపోవడంతో పాటు ఎముకలు, తలపుర్రే, తల వెంట్రుకలు, పక్కటెముకలు, వెన్నుముక కూడా కుళ్లిపోయాయని పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. దీన్నిబట్టి చూస్తే అర్థమవుతోంది ఈ పోస్టుమార్టం రిపోర్ట్ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి, నిందితులకు అనుకూలంగా ఇచ్చారని.. ఒక శవాన్ని పూడ్చి పెట్టి నెల రోజుల తర్వాత బయటకు తీసి, పోస్టుమార్టం చేస్తున్నప్పుడు అత్యంత ప్రామాణికాలు పాటించాలని.. కానీ అలాంటిదేమీ చెయ్యలేదని అన్నారు.. పోస్టు మారడం చేస్తున్న క్రమంలో సీనియర్స్ అయిన డాక్టర్ల బృందం, అందులో ఒక సివిల్ సర్జన్, ఒక గైనకాలజీ మహిళా డాక్టర్, అలాగే ఫోరెన్సిక్ వైద్య బృందం ఉండి కూడా జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ పర్యవేక్షణలో పకడ్మందుగా జరపాలి.. కానీ తూతూ మంత్రంగా జరిపి చేతులు దులుపుకున్నారని అయన విమర్శించారు.. ఈ విషయమై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, హెల్త్ మినిస్టర్ హరీష్ రావు వెంటనే స్పందించి.. నైతిక విలువలు పాటించకుండా సర్టిఫికెట్స్ సస్పెన్స్ కు గురికాబడ్డ డాక్టర్ సుగుణాకర్ రాజును విధులనుండి తక్షణమే తొలగించాలని.. అలాగే గంగరబోయిన సుభద్ర పోస్టుమార్టంలో తప్పుడు నివేదిక ఇచ్చిన డాక్టర్ రాహుల్ ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామరాజు, యాదగిరి, రాపర్తి రాజు, ఎర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, సుంచు విజేందర్, డివైఎఫ్ఐ కార్యదర్శి దూసరి నాగరాజు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, కనక చారి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు