Friday, November 1, 2024
spot_img

రాహుల్‌ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతే

తప్పక చదవండి
  • తెలంగాణ గురించి రాహుల్‌కు అవగాహన లేదు
  • కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో స్వర్ణయుగం : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి నిన్న రాహుల్‌ గాందీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాహుల్‌కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే అని పేర్కొన్నారు. కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం అన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్‌ తెలంగాణ అన్నారు. మోదీ దయా దాక్షిణ్యల మీద బతుకుంది గాంధీ కుటుంబం అన్నారు. బోఫోర్స్‌ కేసులో పీకలలోతు కూరుకు పోయిన చరిత్ర గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఐదుగంటల కరెంట్‌, రైతులు పండిరచిన ధాన్యం కూడా కొనలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ఫైర్‌ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల వెంకటనారాయణ గౌడ్‌, జిల్లా గ్రంథాల చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్టా కిశోర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, గండూరి ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు