Friday, March 29, 2024

అక్రమాల ధరిత్రి ‘ఆదిత్రి’

తప్పక చదవండి
  • పెద్ద చెరువు పరివాహక ప్రాంతంలో భారీ నిర్మాణలకు కౌంట్‌ డౌన్‌
  • కింగ్‌ ఫిషర్‌ చెరువు, పెద్ద చెరువు తూములు కనుమరుగు
  • అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు షురూ అదిత్రి అక్రమ నిర్మాణానికి అమీన్‌ పూర్‌ చైర్మెన్‌ వెన్ను దన్ను
  • పరివాహక ప్రాంతంలో ఇరిగేషన్‌ ఎన్‌ ఓసి జారీలో భారీ చేతివాటం భవిష్యత్‌లో సంభవించే ప్రమాదాలకు బాధ్యులెవరు..?
  • ప్రకృతి వైపరీత్యాలను ఆహ్వానించే విధంగా భారీ నిర్మాణాలు అది ముమ్మాటికీ బఫర్‌ జోన్‌, గ్రీన్‌ బెల్ట్‌ : హెచ్‌ఎండిఏ
  • ఫ్రీ లాంచ్‌ పేరుతో నిండా మునగనున్న కొనుగోలు దారులు మరో ‘సాహితి’ కానున్న ‘ఆధిత్రి’ నిర్మాణ సంస్థ
  • భారీ ప్రచారంతో కొనుగోలుదారులకు గాలం

నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేని ప్రాంతాలు.. అయినా ఎవరికీ లెక్కలేనితనం.. భవిష్యత్‌ తరాల వారి జీవితాలు ఆగమవుతున్నా వారికి పట్టింపులేదు.. ప్రీ లాంచ్‌ అనే అందమైన ఊహా లోకాన్ని సృష్టిస్తూ.. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ.. అమాయకులకు వలవేస్తూ.. అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు పూటకొకటి పుట్టుకొస్తున్నాయి.. అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వ అధికారులను కాసులతో కొనేస్తూ.. అనుమతుల పేరుతో మాయ చేస్తూ.. ప్రమాదకర పరిస్థితుల్లో భారీ నిర్మాణాలు చేస్తూ.. చెరువులను, తూములను, కనుమరుగు చేస్తూ.. గ్రీన్‌ బెల్ట్‌, బఫర్‌ జోన్లలో సెల్లార్లతో కూడిన భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలను చేస్తూ.. చట్టాలకు, నియమ నిబంధనలకు సవాల్‌ విసురుతున్నారు.. భవిష్యత్తులో ఎదురయ్యే భయంకర ప్రమాదాలను సైతం చూడకుండా.. ప్రజల ప్రాణాలతో నిస్సిగ్గుగా ఆడుకుంటున్నారు.. అధికార ప్రభుత్వ నియంత్రణ కరువవడంతో అక్రమ ముష్కరుల అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.. చెరువులను చెరబడుతూ పెను ప్రమాదాలకు కారణభూతం అవుతున్న ఓ భారీ కథా.. కమామీషు వాస్తవాలను మీముందుకు తీసుకుని వస్తోంది ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’..

హైదరాబాద్‌, 15 మే (ఆదాబ్‌ హైదరాబాద్‌ ) :

- Advertisement -

సంగారెడ్డి జిల్లా, పఠాన్‌ చెరువు నియోజిక వర్గంలోని , అమిన్‌ పూర్‌ మున్సిపాల్టీ పరిధిలో గల పెద్ద చెరువు దిగువ భాగాన కింగ్‌ ఫిషర్‌ చెరువు, బంధం కొమ్ము చేరువులకు తలమానికంగా ఉన్న పెద్ద చెరువు పరివాహక ప్రాంతంతో పాటు, తూములను కనుమరుగు చేస్తూ.. అదిత్రి నిర్మాణ సంస్థ భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.. అందులో భాగంగానే ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఫ్రీ లాంచ్‌ పేరుతో భారీగా ప్రచారాన్ని చేపడుతూ.. కొనుగోలుదారులను నిండా ముంచే ఎత్తుగడ వేస్తోంది.. నిర్మాణాలకు అనుమతి ఇవ్వడానికి వీలు లేని ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ బెల్ట్‌, బఫర్‌ జోన్లలో 4 సెల్లార్లతో కూడిన 39 అంతస్థుల భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు, కొనుగోలుదారుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.. నిర్మాణాలకు నిషేదిత ప్రాంతమైన గ్రీన్‌ బెల్ట్‌, బఫర్‌ జోన్లలో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నా, మరో వైపు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పలుమార్లు హెచ్చరించినా అవేమీ పట్టించుకోకుండా యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం వారి అవినీతికి అద్దం పడుతోంది.. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు అదిత్రి నిర్మాణ సంస్థ నిర్మించే స్థలం గుండా భారీగా వరద నీరు చేరడంతో.. పరిసర కాలనీల ఇండ్లలోకి వరద నీరు చేరి కాలనీలు చెరువులను తలపించాయి.. మరి ప్రవాహ ప్రాంతంలోనే 4 సెల్లార్లతో కూడిన 39 అంతస్థుల భారీ భవన నిర్మాణాలు చేపడితే.. భవిష్యత్‌ లో జరగబోయే ప్రమాదాలకు బాధ్యత ఎవరు వహిస్తారు..? చెరువులను, నాలాలను, తూములను ఎవరు కబ్జాచేసినా, చెరువులను పూడ్చిన తక్షణమే సంబంధిత అధికారులు వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని చట్టం చెపుతోంది .. కానీ అధిత్రి నిర్మాణ సంస్థ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వారికీ అధికారులకు ఉన్న లోపాయికారి ఒప్పందమే కారణం అని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ప్రచారం సాగుతోంది .. రేరా, హెచ్‌.ఎం.డి.ఏ., ఏవియేషన్‌, పొల్యూషన్‌, ఫైర్‌, ఇరిగేషన్‌, మైన్స్‌ కి సంబంధించిన పలు కార్యాలయాల నుండి చట్ట బద్దంగా అనుమతులు పొంది, ఆ తరువాత నిర్మాణ పనులు చేపట్టాలి.. రేరా అనుమతి పొందిన తరువాత బహిరంగ మార్కెట్‌ లో అమ్మకాలు చేపట్టుటకు ప్రచారాలు కొనసాగించాలి.. కానీ అందుకు బిన్నంగా అదిత్రి నిర్మాణ సంస్థ ఫ్రీ లాంచ్‌ పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించే యత్నం చేస్తుండటంతో.. వారు నిండా మునిగే ప్రమాదం ఉంది.. గతంలో సాహితి నిర్మాణ సంస్థ ఫ్రీ లాంచ్‌ పేరుతో వందలాది మంది కొనుగోలుదారుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన విషయం మరవక ముందే.. అదే తరహాలో అదిత్రి నిర్మాణ సంస్థ అక్రమాలకు తేర లేపింది.. కాబట్టి కొనుగోలు దారులు అప్రమత్తంగా లేకపోతే వారి వలలో చిక్కక తప్పదు.. ఈ భారీ వ్యవహారం వెనుక స్థానిక అమీన్‌ పూర్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ పాండు రంగారెడ్డితో పాటు, వారి కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి… అదిత్రి నిర్మాణ సంస్థకు భూమి ఎక్కడ నుండి వచ్చింది..? భూమికి నాలా కన్వర్షన్‌ అయ్యిందా..? ప్రభుత్వ ఖజానాకు చట్ట బద్దంగా రుసుము చెల్లించారా..? చెరువును కనుమరుగు చేసే కుట్రలో భాగస్వాముల వివరాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.. ‘మా అక్షరం అవినీతి పై అస్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు