Wednesday, April 24, 2024

అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ!

తప్పక చదవండి

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. అదానీ గ్రూప్‌లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్‌ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్‌ కంపెనీలపై దర్యాప్తు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆధారరహితమని తెలిపింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాతనే అదానీ గ్రూప్‌ కంపెనీలపై నిఘా పెట్టినట్టు వివరించింది. అయితే, సెబీ.. సుప్రీంకు సమర్పించిన తాజా మదుపర్ల సంపదను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్‌ నియంత్రణ సంస్థ అది. తమ కష్టార్జీతం నీటిపాలు కాకుండా కాపాడుతుందని ప్రతి భారత మదుపరి నమ్మే సంస్థ అది. అందుకు తగ్గట్టుగానే.. గడిచిన 35 ఏండ్లలో ఎన్నెన్నో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చింది కూడా. అయితే, రాజావారి ఆప్తమిత్రుడి కంపెనీలకు వచ్చేసరికి అదే సంస్థ ఇప్పుడు డొంకతిరుగుడు వైఖరిని ప్రదర్శించింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందే తప్పుడు అఫిడవిట్‌లను నిర్లజ్జగా సమర్పించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై గతంలో ఎలాంటి దర్యాప్తు నిర్వహించలేదని అబద్ధాలు వల్లెవేసింది. అఫిడవిట్‌పై ప్రతిపక్ష పార్టీలతో పాటు మేధావులు, నెటిజన్లు మండిపడుతున్నారు. అదానీ గ్రూప్‌ విషయంలో సెబీ అబద్ధాలు వల్లె వేస్తున్నదని ధ్వజమెత్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు