Sunday, October 13, 2024
spot_img

రిటైరైన సోమేష్ కు మళ్లీ పదవి ఏంటి..?

తప్పక చదవండి
  • భూములన్నీ లాక్కున్నారు..
  • సోమేష్‌ను సలహాదారుగా తీసేయాల్సిందే..
  • డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క..
    హైదరాబాద్, 10 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌కు సలహాదారుగా నియమించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ రాష్ట్రానికి గౌరవంగా వెళ్లి పని చేసుకోవాలని అన్నారు. అంతేకానీ, సోమేష్‌ కుమార్‌ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా కేసీఆర్‌కు సలహాదారుగా నియమితులు అవ్వడం ఏంటని ప్రశ్నించారు. భూ బకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్‌ కుమార్ సహాయపడ్డారని ఆరోపించారు. భట్టి విక్రమార్క బుధవారం మీడియాతో మాట్లాడారు. పేదలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి భూములను ధరణి పోర్టల్ పేరుతో లాక్కున్నారని విమర్శించారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని, ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్రణాళికలో సూత్రదారి సోమేశ్ కుమార్ అని అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమార్‌, అరవింద్‌ ఉన్నారని అన్నారు. ఏటా వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రాజెక్టును 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇంత మంది సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. రిటైర్డ్‌ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా? అని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్‌ శాఖకు రిటైర్డ్‌ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారని, సోమేష్‌ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టేనని అన్నారు. వెంటనే సోమేష్‌ కుమార్ సలహాదారు పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై విచారణ చేయించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్‌ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు