Saturday, April 27, 2024

ఢిల్లీకి వెళ్లడం లేదు

తప్పక చదవండి
  • నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు
  • ఇతరుల సంఖ్యాబలం గురించి నాకు సంబంధం లేదు
  • సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిరచారని ఆవేదన
  • క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే
  • సిద్దరామయ్యతో హైకమాండ్‌ చర్చలు.. అనూహ్యంగా ఢిల్లీకి డీకేకు పిలుపు

న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరానేదానిపై ఉత్కంఠ వీడడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తన అధ్యక్షతననే 135 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందని, వీరందరి మద్దతు తనకే ఉందని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు. సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని తొలుత నిర్ణయించినప్పటికీ, కొంతమంది వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల సంఖ్యాబలం గురించి తాను ఏమీ మాట్లాడనని, తన సంఖ్యాబలం మాత్రం 135 అన్నారు. క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే సీట్లు పెరిగేవని, అయినప్పటికీ ఫలితాల విషయంలో తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. డీకే పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో గడపాలని బెంగళూరులోనే ఉన్నానని చెప్పిన డీకే శివకుమార్‌.. రాత్రికి ఢిల్లీకి బయలుదేరతా అన్నారు. కానీ అంతలోనే ఢిల్లీకి వెళ్లడం లేదంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. తాను అనారోగ్య సమస్యలతో ఢిల్లీకి వెళ్లడం లేదని తెలిపారు.
కాగా, సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్‌ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా డీకే శివకుమార్‌ను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశించింది. ఇప్పటికే సిద్దరామయ్య ఢిల్లీలో మకాం వేశారు. ఆయనతో చర్చలు సాగుతున్నాయి. తనకే సీఎం సీటు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండగా.. పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ తనకే సీఎం సీటు ఇవ్వాలని డీకే శివకుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరూ సీనియర్ల ప్రతిపాదనల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కత్తిమీద సాములా మారింది. ఎవర్ని ఎంపిక చేస్తే ఏమవుతుందోననే టెన్షన్‌ మొదలైంది. ఎన్నికల్లో గెలుపు ఒక ఎత్తయితే.. నాయకులను కాపాడుకోవడం, వారిని బుజ్జగించడం మరో ఎత్తులా మారింది. కర్నాకటలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ బలమైన సామాజిక నాయకులు కావడంతో ఇద్దరిలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే మరొకరు అలకబూని పార్టీలో విబేధాలు వచ్చే చాన్స్‌ ఉంది. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని గెలపించారు. కానీ… ఇప్పుడు సీఎం సీటు విషయంలో మాత్రం నాయకుల్లో క్లారిటీ రావడం లేదు. ఈ విషయం హైకమాండ్‌కు పెద్ద టాస్క్‌లా మారింది. సీఎం సీటు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో.. తుది నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేశారు. దీంతో సీఎం ఎంపిక కోసం పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారు. కాంగ్రెస్‌ పెద్దలు పలు దఫాలుగా సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. మరోవైపు.. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా డీకే శివకుమార్‌ మాత్రం బెంగళూరులోనే తన మద్దతుదారులతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి డీకేకు కూడా ఫోన్‌ కాల్‌ రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరితోనూ పార్టీ పెద్దలు మాట్లాడే చాన్స్‌ ఉంది. అయితే..కాంగ్రెస్‌ హైకమాండ్‌ కు ఇద్దర్నీ ఒప్పించడం చాలా కష్టంగా మారింది. 2018లో ఏర్పాటైన శాసనసభ గడువు ఈ నెల 24 నాటితో ముగుస్తుంది. ఆలోగానే నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. గతవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు