Saturday, July 27, 2024

చెట్లు నరికిన ప్రభుత్వ ఉద్యోగి పై చర్యలేవి.?

తప్పక చదవండి
  • జిల్లా అధికారికి తెలియకుండానే కార్యదర్శి నిర్వాహకం..
  • చెట్లు నరికి ఐదు రోజులు అవుతున్న చర్యలు శూన్యం..
  • ప్రభుత్వ ఉద్యోగికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు..
  • చెట్లు నరికిన విషయం నా దృష్టికి రాలేదు : డీపీిఓ..
    సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్‌ మండలం ధర్మపురం శివారు మేఘ తండా వెళ్లే దారిలో హరితహారంలో నాటిన 30 కి పైగా చెట్లను ప్రభుత్వ ఉద్యోగి ఆంగోతు నాగేశ్వరావు జెసిబి సహాయంతో తొలగించారు. ఈ విషయంపై స్థానిక కార్యదర్శి సతీష్‌ ఉన్నతాధి కారుల సూచనల మేరకు ఆగస్టు 25 న పెన్‌ పహాడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదు పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు చెట్లు తొలగించిన వ్యక్తితో అధి కారులు, ప్రజా ప్రతి నిధులు కుమ్మక్కయి నాగేశ్వరరావు పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని గ్రామ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కలలుగన్న తెలం గాణలో హరిత తెలంగాణ ఒకటి, కోట్ల రూపాయల వెచ్చించి, తండా నుండి పట్టణాల వరకు కోట్ల మొక్కలను నాటించారు. కానీ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయి చెట్లు నరికేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా లోపాయికార ఒప్పం దంతో అంత కలిసి మమ అనిపించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ముందు నుండే,గ్రామ కార్యదర్శి సహా మండల అధికారులు, చెట్లు నరికిన వ్యక్తిని వెనకేసుకొ స్తూన్నారని, చెట్లు నరికి ఐదు రోజులు అవుతున్న, వీరి లోపాయికర ఒప్పందంతో చిన్నపాటి మొక్కలను తీసుకొచ్చి నాటిచినట్లు తెలుస్తుంది.

గ్రామ కార్యదర్శి సతీష్‌.. ఆగస్టు 25న కార్యదర్శి (చెట్లు నరికిన రోజు) మాట్లాడుతూ.. ధర్మపురం శివారు మేఘ్య తండా వెళ్లే దారులు నాగేశ్వరావు అనే వ్యక్తి వ్యవసాయ భూమి వద్ద రోడ్డు పక్కన నాటిన హరితహారం లోనే మొక్కలను చిన్నవి పెద్దవి 20కి పైగా తొలగించారని, అతనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పిన కార్యదర్శి, ఐదు రోజు ల తర్వాత ఆగస్టు 29 న అదే కార్యదర్శిని వివరణ కోరగా నాగే శ్వరరావు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చెట్లు తొలగించిన ప్రాంతంలో మొక్కలు నాటాడని, ఈ విషయం లో ఎంపీడీఓ సాను కూలంగా స్పందించారని తెలిపారు.అతనికి ఏలాంటి పెనాల్టీ విధించలేదని, విధించబోమని, చెట్లు తీసేసిన ప్రాంతంలో మొక్కలు నాటాడు కాబట్టి అంతటితోనే సరిపెడుతు న్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు కావాలంటే మీరు ఎంపీడీఓతో మాట్లాడండి అంటూ సమాధానం దాటవేశారు.
ఎంపీడీఓ వివరణ : మొక్కలు తొలగించిన ఆంగోతు నాగేశ్వ రావుపై పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు ఇచ్చాము. మొక్కలు తొలగించిన స్థానంలో 10 కొత్త మొక్కలను నాటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
నా దృష్టికి రాలేదు : డిపిఓ.. పెన్‌ పహాడ్‌ మండలం ధర్మపురంలో 30 కు పైగా (చిన్న,పెద్ద) చెట్లు నరికిన వీడియో లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.వివిధ పత్రికలలో వార్త వెలువడిన ప్పటికీ జిల్లా పంచాయతీ అధికారికి మాత్రం ఈ విషయం తెలి యక పోవడం, కిందిస్థాయి సిబ్బంది అయిన కార్యదర్శి, ఎంప ిఓ, ఎంపీడీఓ ఎవరు కూడా డిపిఓ దృష్టికి తీసుకెళ్లకపోవడం గమ నార్హం. గ్రామ పంచాయతీ లో స్థానిక కార్యదర్శి ఏ రేంజ్‌ లో చక్రం తిప్పుతున్నాడో ఈ చిన్న సంఘటన చూస్తేనే అర్థమ వుతుంది. ఈ విషయంపై డిపిఓ యాదయ్యను వివరణ కోరగా ధర్మపురం గ్రామంలో హరితహారం లో నాటిన చెట్లును నరికేసిన విషయం నా దృష్టికి రాలేదని, తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు