Wednesday, May 1, 2024

దాహార్తి పథకంలో ధన దాహం..

తప్పక చదవండి
  • కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ యాజమాన్యం..
  • అధికారుల అంతులేని అవినీతితో కోట్ల రూపాయల కుంభకోణం..
  • చేయని పరీక్షలను చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చిన అవినీతి అధికారులు..
  • సమాచార హక్కు చట్టం ద్వారా బట్టబయలైన వాస్తవాలు..

గుక్కెడు మంచినీటి కోసం అలమటించే సామాన్యుల గొంతు నొక్కుతున్నారు కొందరు ముష్కరులు.. వీరితో చేతులు కలిపిన కొందరు అధికారులు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ అత్యున్నత ఆశయాన్ని నీరుగారుస్తున్నారు.. కిష్ణా నది నుంచి ప్రజలకు సరఫరా చేయవలసిన మంచినీటి కాంట్రాక్ట్ ను అవినీతి మయం చేస్తూ.. కోట్ల రూపాయల టెండర్ ను కొల్లగొట్టిన జీ.వీ.పీ.ఆర్. ధనదాహం వెలుగుచూసింది.. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.. నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల ప్రజల దాహార్తిని తీర్చే తెలంగాణ డ్రింకింగ్ వ్వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా అంతులేని అవినీతిని మూటకట్టిన జీ.వీ.పీ.ఆర్. సంస్థ చేసిన భాగోతం మీ కోసం.. నల్గొండ జిల్లాలోని, నాలుగు నియోజక వర్గాలకు మంచినీటి సరఫరా కోసం.. మిషన్ భగీరథ ద్వారా టేల్ పాండ్ ( కృష్ణానది ) ద్వారా అందించడానికి టెండర్ పిలిచారు.. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు పథకం ద్వారా ఈ ప్రక్రియ చేపాట్టాల్సి ఉంటుంది.. అయితే టెండర్ ను పొందిన సంస్థ జీ.వీ.పీ.ఆర్. ఇంజినీరింగ్ లిమిటెడ్, జూబిలీ హిల్స్, హైదరాబాద్.. వారు ప్రభుత్వం ఏర్పరిచిన నియమ నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఎవరికీ ఇవ్వకూడదు.. కానీ వాటిని అతిక్రమించి సబ్ కాంట్రాక్టర్లను నియమించుకుని, నాశిరకం పనులు చేపట్టారు.. హైడ్రో టెస్ట్ చేసిన తరువాతనే మంచి నీరు సరఫరా చేయాలి.. కానీ హైడ్రో టెస్ట్ చేయకుండానే నీటిని విడుదల చేశారు.. చేయని హైడ్రో టెస్టు చేసినట్లు అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.. ఈ వాస్తవాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూశాయి.. కాగా హైడ్రో టెస్ట్ చేస్తే పైప్ లైన్ నాణ్యత తెలుస్తుంది.. కానీ హైడ్రో టెస్ట్ చేయిచాకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది.. పూర్తి ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1450 కోట్లు.. అధికారులు ఈ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారన్నది నిర్విదాంశం.. జరిగిన అవినీతి, మోసం అన్ని ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’..’మా అక్షరం అవినీతిపై అస్త్రం’…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు