Saturday, June 15, 2024

వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు..

తప్పక చదవండి
  • మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం..
  • సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది..?
  • న‌ల్గొండ‌లో సాగుక చుక్క‌నీరు అద‌నంగా ఇవ్వ‌లేదు..
  • చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు భట్టి సవాల్
  • స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయిన నేటి సమాజం
  • బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..?
  • ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : భట్టి..

హైదరాబాద్ : బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో 5 నెలల్లో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ వారి తాత, ముత్తాతలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సత్తా, దమ్ము, ధైర్యం లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల వారోత్సవాలు చేసే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఒక్క చిన్న చెరువు అయినా తవ్వారా అని భట్టి నిలదీశారు. “కృష్ణా, గోదావరిపై పెద్ద ఆనకట్టలు ఏమైనా కట్టారా? పెండింగులో ఉన్న సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వారోత్సవాలు చేస్తారు?” అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

కేసిఆర్ ఆలోచన పోయిందా, మెదడు పోయిందా అర్థం కావడం లేదు, రెవెన్యూ చట్టం మొఘలులు పాలన నుండి రూపాంతరం చెందుతు వస్తుందన్నారు. భూ రికార్డులను భద్ర పరిచే రెవెన్యూ చట్టాన్ని చిన్నాభిన్నం చేశాడని అన్నారు. కేసీఆర్ ధరణి పేరుతో భూ కుంభకోణానికి పాలడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలకులు గాడిదలు కాస్తున్నారా,కాంగ్రెస్ హయాంలో ఎసెల్బీసీ సొరంగం పనులు చేపట్టి 30 కిలో మీటర్లు చేపడితే బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో 2,3 కిలోమీటర్లు తొవ్వారని అన్నారు. నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సోయిలేని పాలకులు మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సొరంగం పనులు కనిపిస్తాయన్నారు. జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా మంత్రా దిష్టిబొమ్మనా, ఎందుకు కేసిఆర్ ను నల్గొండ ప్రాజెక్టుల గురించి అడగడం లేదని తెలిపారు.
రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లకోసం తొమ్మిదేళ్ళ పాలనలో నల్గొండ జిల్లాకు ఒక్క ఏకరానికైన నీరు ఇచ్చారా, ఏమి సాధించారని సాగునీటి ఉత్సవాలు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పాలకులు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది? అంటూ ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా గుత్తా ఏమి తెచ్చాడు, ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి, కేసిఆర్ ను కలవడానికి భయపడతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా నేతలు సీఎం పక్కన కూర్చుని ఇక్కడి సమస్యలు పరిష్కారం చేశేవారని, కానీ ఇప్పటి బీఆర్ఎస్ పాలకులు జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ ఏమి చేసింది, మీరు ఏమి చేసారో తేల్చుకుందాం రండి, నల్గొండ జిల్లా పర్యటనలో ఒక్కో రోజు మీది ఒక్కో కథ చెబుతా అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16న పీపుల్స్ మార్చ్ చేపట్టి దేవరకొండ వరకు అనేక జిల్లాలు నియోజకవర్గాలు వందల గ్రామాలు కాలినడకన తిరిగిన సందర్భంగా వందల మంది ప్రజలు క్షేత్రస్థాయి పోలీసులు పెడుతున్న వేధింపులు, ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయి పోలీసుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని గ్రహించి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశాను.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను అమలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులైన డిజిపి, ఐజి, డిఐజి, ఎస్పీ లాంటి అధికారులతో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు డీ లింకు అయ్యి ఉన్నతాధికారులు చెప్పినట్టుగా కాకుండా అధికార పార్టీ స్థానిక శాసనసభ్యులు ఆదేశాలను పాటిస్తూ.. వారికి అటాచ్ అయిపోయి వారిచే ఆదేశాలను అమలు చేసే పోలీసులుగా రాష్ట్రంలో మారిపోయారు. క్షేత్రస్థాయి పోలీసులు అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ప్రైవేటు సైన్యంగా మారిపోవడంతో సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారు. క్షేత్రస్థాయి పోలీసులు అధికార పార్టీ శాసనసభ్యులు చెప్పినట్టుగా నడుచుకుని క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారులు అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఇష్టా ఇష్టాల ప్రకారమే నడుచుకుంటే సమాజంలో బతికే పరిస్థితి లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీల కోసం కాదు. ప్రజాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అని వివరించారు.

భట్టి పాదయాత్రకు ఉత్తమ్ సంఘీభావం :
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర 84వ రోజు గురువారం రాత్రి నక్కలగండి ప్రాజెక్టు నుంచి బయలుదేరగా పాతూర్ తాండ స్టేజ్ వద్ద నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత పాదయాత్రలో పాతూరు తండా వరకు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు