Friday, April 26, 2024

సక్సెస్ కిల్లర్ అరెస్ట్..

తప్పక చదవండి
  • కదులుతున్న సెలెబ్రెటీల డొంక..
  • రాయదుర్గం డ్రగ్స్ కేసులో కీలక మలుపు..
  • వినియోగదారుడని వదిలేసిన రఘు తేజ అరెస్ట్.
  • నెల రోజుల తర్వాత కళ్లు తెరిచిన సైబరాబాద్ పోలీసులు.
  • పోలీసులు వ్యవహారంపై యాంటీ నార్కోటిక్ టీం నజర్.
  • అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పీస్ లో అప్పగింత..
  • పెద్దల ఒత్తిళ్లతో రఘుతేజ కు 41(ఏ) నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం..

హైదరాబాద్ : డ్రగ్స్ కింగ్, రఘు తేజను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. రఘు తేజ అరెస్ట్ తో సెలబ్రిటీల గుండెల్లో ధడ మొదలైంది.. ఎవరి తీగ ఎలా కదులుతుందో అన్న ఆందోళన వారిలో మొదలైందని తెలుస్తోంది.. రైట్ రాయల్ గా డ్రగ్స్ దందాను నడిపిస్తున్న రఘు తేజ.. ఎంతో చాకచక్యంతో చట్టం నుంచి ఎప్పటి కప్పుడు తప్పించుకుంటూ వస్తున్నాడు.. ఇటు పోలీసులను, అటు రాజకీయ నాయకులను తనదైన శైలిలో మేనేజ్ చేస్తూ.. దర్జాగా తప్పించుకుని తిరుగుతున్నాడు రఘు తేజ.. ఇతగాడి వ్యవహారంపై ‘ఆదాబ్ హైదరాబాద్’ వాస్తవ కథనాన్ని ప్రచురించిన సంగతి విదితమే.. ఈ కథనం అటు హై ప్రొఫైల్ సొసైటీ లోనూ.. ఇటు పోలీసుల్లోనూ ప్రకంపనలు సృష్టించింది.. దీని ప్రభావంతో ఎట్టకేలకు నెలరోజుల తరువాత కళ్ళు తెరిచిన సైబరాబాద్ పోలీసులు.. రఘు తేజను అదుపులోకి తీసుకున్నారు.. అతని అక్రమ డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని జల్లెడ పట్టడానికి సమాయాత్తం అయ్యారు.. అయితే అతడిని అరెస్ట్ చేసిన ఎస్.ఓ.టి. పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే సదరు రఘు తేజ అరెస్ట్ చేసిన ఎస్.ఓ.టి. పోలీసులు అతన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అప్పగించాక అతనికి 41 (ఏ) నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ పై విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది..

కాగా సదరు రఘు తేజ గచ్చిబౌలిలో ఇన్ఫినిటీ ఫుడ్ అండ్ డ్రైవ్ ఇన్ హోటల్ కూల్చివేసినా అక్కడే తిష్ట వేసి తన డ్రగ్స్ దందాను యథేచ్ఛగా నడిపించాడు.. 30 సీసీ కెమెరాలతో నిత్యం నిఘా వేశాడు.. రోడ్లను కబ్జా చేసి డ్రగ్స్ , మత్తు పదార్ధాల సప్లై.. నిర్వహిస్తున్నాడు.. మీడియాను, పోలీసులను మేనేజ్ చేయడంలో తేజ దిట్ట.. అని తెలుస్తోంది.. గోవా నుంచి కోకైన్ తీసుకు వచ్చి సరాఫరా చేసేవాడు.. ప్లైట్ లో దర్జాగా వెళ్లి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తీసుకు రావడం అతగాడికి అలవాటు. కాగా ఇతగాడి గత 2 ఏండ్ల వ్యవహారంపై దర్యాప్తు మొదలైంది.. రఘు తేజను గట్టిగా విచారిస్తే ఎందరో సెలబ్రెటీల బండారం బట్టబయలు అవడం ఖాయం.. యువతను మత్తులో ముంచుతున్నారని తీవ్ర అరోపణ తనిపై ఉన్నాయి.. కాగా ఇతను కూడా ఇప్పటికే డ్రగ్స్ కు అలవాటు పడ్డట్లు పోలీసులు గుర్తించారు..

- Advertisement -

ఇతని భాగోతం పసిగట్టి వార్తలు రాసిన, ప్రసారం చేసిన మీడియాపై.. సోషల్ మీడియాలో ఫేక్ మెస్సెజ్ లు స్ప్రెడ్ చేస్తున్నారు.. ఇక తేజ అరెస్ట్ తో సెలబ్రిటీలతో భయాందోళనలు మొదలైనట్టు తెలుస్తోంది.. బడా బాబుల ఒత్తిళ్లతోనే రఘుతేజ కు 41(ఏ) నోటీసులు ఇస్తూ.. కేవలం అతను డ్రగ్స్ వినియోగించారని తేల్చేసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా నెల రోజులైనా అతను డ్రగ్స్ సప్లై చేస్తున్న విషయంపై ఫోకస్ పెట్టలేదు రాయదుర్గం సిఐ. గతంలో సినిమా పెద్దలు కొందరు డ్రగ్స్ వినియోగించారని విచారణ కూడా జరిగింది.. ఆ వ్యవహారం ఇప్పటికీ ఈడీ దర్యాప్తులో ఉంది.. ఇలాంటి డ్రగ్స్ దందాల వలన సీఎం కేసీఆర్ ఆశయాలకు తూట్లు పడుతున్నాయన్నది నిర్విదాంశం.. యాంటీ నార్కొటెక్ సెల్ ఏర్పాటు చేసినా డ్రగ్స్ దందా ఆగలేదు.. మాముళ్ల మత్తుతోనే కేసును వీక్ చేస్తున్న లోకల్ పోలీసులు అనే విమర్శలున్నాయి.. డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు ఎక్కడ అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.. పైగా సెలబ్రెటీల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకే తేజకు స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.. డ్రగ్స్ వినియోగదారుడి వ్యవహారంపై ఎన్డీపీసీ యాక్ట్ ఏం చెబుతోంది అన్న విషయం కూడా పోలీసులకు తెలియకపోవడం శోచనీయం.. ఒక హోటల్ నిర్వాహకుడు డ్రగ్స్ వినియోగిస్తుంటే.. అదే డ్రగ్స్ కస్టమర్స్ కి చేరలేదనే గ్యారెంటీ ఏంటీ.? అన్నది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న.. కాగా బడా డ్రగ్స్ స్కాంకి తెరదించే ప్రయత్నాలు రాయదుర్గం పోలీసులు చేస్తున్నారన్నది విశ్లేషకుల విమర్శలు.. దీనికి సమాధానం వారు చెప్పగలరా..? అన్నది కాలమే తేల్చాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు