Wednesday, May 8, 2024

ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

తప్పక చదవండి
  • హిందూ దేవాలయ భూములపై నిర్లక్ష్య వైఖరి..
  • విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో
    కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు..

హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ముఖ్యంగా భువనగిరి పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయ, ప్రభుత్వ, హిందువుల భూములపై జిల్లా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, మైనారిటీల సంతుష్టీకరణ కోసం దేవాదాయ, ప్రభుత్వ, హిందువులు భూములను అప్పనంగా కట్టబెడుతూ.. జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరును విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు.. నయీమ్ సిట్ కేసులో ఉన్న భూముల్లో అనుమతులను వ్యతిరేకించారు.. ఇట్టి విషయాలలో వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

1) నయీమ్ సిట్ కేసులో ఉన్న భూముల్లో ఈద్గాని హోం మంత్రి ఎలా ప్రారంభిస్తారు. 2) మీన నగర్ లో ఉన్న గ్రంధాలయం ముస్లిం కమ్యూనిటీ హాల్ గా ఎలా మారుస్తారు.. 3) వంజరీ సంఘం గ్రంధాలయం మసీదుగా మార్చాలనే కుట్ర.. 4) ఇండోర్ స్టేడియం లో నిర్మితమైన అక్రమ మసీదుపై చర్యలు తీసుకోవాలి 5) ఖిలా నగర్ లో నిర్మితమైన అక్రమ మసీదుపై చర్యలు తీసుకోవాలి.. 6) పాల శీతల కేంద్రం ఎదుట ఒక హిందూ సోదరుని భూమి కబ్జా, బెదిరింపులపై చర్యలు.. 7) గోవుల అక్రమ రవాణా, గో మాంస విక్రయ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి.. 8) భువనగిరి పట్టణంలో అక్రమంగా వచ్చి నివసిస్తున్న విదేశీయులపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

కావున తక్షణమే కలెక్టర్ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని తరపున డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి తోట భానుప్రసాద్, హిందూ వాహిని సోషల్ మీడియా కన్వీనర్ గీస ఆనంద్, విహెచ్పి జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్, కోశాధికారి చామ రవీందర్, ఉపాధ్యక్షులు కర్రె ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు కేమోజి మల్లికార్జున్, యాదాద్రి పట్టణ అధ్యక్షులు రాఘవుల సాయి, జిల్లా బజరంగ్దళ్ కన్వీనర్ కోకల సందీప్, కో కన్వీనర్ మేకల భాను, పట్టణ కన్వీనర్ పొన్నాల వినయ్, హిందు వాహిని పట్టణ అధ్యక్షులు రత్నపురం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు