Saturday, May 18, 2024

జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్..

తప్పక చదవండి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ స్కూల్ మాఫియాను అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టానికి జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రాక, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు లేక స్కూల్స్ అన్ని వెలవెలబోతున్నాయి. ఈ సందర్భంగా కమల్ సురేష్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని ప్రగల్బాలు పలికే ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఏదో సాధించుతానని రాజకీయాలు చేయడం మానేసి, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో వెంటనే సదుపాయాలు కల్పించి, టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ యొక్క ఆగడాలు రోజు రోజుకీ శృతిమించి ఇష్టానుసారంగా బ్రాంచులు విస్తరించి, పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతున్నారు.. ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకొని ఫీజు నియంత్రణ చట్టం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సినటువంటి ఎం.ఈ.ఓ., డీ.ఈ.ఓ. లు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యొక్క ఆగడాలను చూసీ చూడనట్టు నటించడం అంటే ప్రభుత్వం యొక్క చేతకానితనానికి నిదర్శనం. కాబట్టి వెంటనే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి.. ప్రచారం కోసం హంగు అర్పడాలతో ఏర్పాటు చేసిన “మన ఊరు మనబడి.. మనబస్తీ మనబడి” స్కీమును ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని తెలియజేశారు.. అదే విధంగా కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8600 ప్రభుత్వ పాఠశాలను మూసి వేయించడం జరిగింది.. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని, కాబట్టి ప్రభుత్వ అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదు.. కాబట్టి జూన్ 26వ తారీఖున చేసే రాష్ట్రవ్యాప్త బంద్ తో అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని.. పేద విద్యార్థులకు విద్య కోసం ప్రభుత్వం పాటుపడాలని తెలియజేశారు.. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీ.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని గద్దె దింపే పనిలో ఏబీవీపీ నిమగ్నమైతుందని హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు