HomeఫోటోలుPolice Complaint | మూవీ షూటింగ్ పూర్తి

Police Complaint | మూవీ షూటింగ్ పూర్తి

ప్రధాన పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్‌చంద్ర

గ్లామ‌ర్ పాత్ర‌లతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar).. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆడియ‌న్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్ట‌ర్‌తో రాబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర (Naveen Chandra) ప్ర‌ధాన పాత్ర‌ల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది(Completes Shooting). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ (Post-Production) పనులు జరుపుకుంటోంది.

- Advertisement -
Police Complaint3

ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుంది. తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna)పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మ‌హరాణా నిర్మిస్తున్నారు. అఘోర (తెలుగు–తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Police Complaint2

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ (Chain Reaction of Karma) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్ర‌ యూనిట్ అంద‌రి స‌పోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం. సినిమా ఔట్‌పుట్ బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాగానే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాం” అన్నారు.

Police Complaint
- Advertisement -
RELATED ARTICLES

Latest News