Thursday, April 18, 2024

వృద్ధుల ఆకలి తీర్చిన జనగామ అమ్మ ఫౌండేషన్..

తప్పక చదవండి

హైదరాబాద్, సోమవారం రోజు జనసేన పార్టీ జనగామ జిల్లా వీర మహిళ మల్యాల హేమ నాగరాజు పుట్టినరోజు సందర్భంగా రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒక పూట ఆకలిని తీర్చి అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో భాగంగా ఆకలితో ఉన్నవారికి ఒక పూట ఆకలి తీర్చి.. ఘనంగా తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ మాట్లాడుతూ.. జనసేన వీర మహిళ మల్యాల హేమ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని.. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయంలో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పిల్లలకు పండ్లు పంపిణీ చేస్తూ.. తోచినంత సహాయం చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నారని ప్రతి ఒక్కరు వీర మహిళ కూడా మనలా సమాజంలో జీవిస్తున్న అనాధలకు అభాగ్యులకు అండగా నిలబడాలని.. వారిని అక్కున చేర్చుకొని ఆకలి తీర్చాలని.. నీడను ఇవ్వాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.. ఈ సేవా కార్యక్రమంలో మల్యాల లక్షిత, అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు వంగ భీమ్ రాజ్, పండుగ నరేష, సల్ల మహేష్, అంబాల శివనాథ్ గౌడ్, వెంకీ , నర్సింగ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు