Sunday, September 8, 2024
spot_img

అమ్మవారి నామ స్మరణతో..అలరారిన ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం..

తప్పక చదవండి
  • దారులన్నీ ఉజ్జయిని మహంకాళి జాతర వైపే.
  • అమ్మవారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్..
  • దర్శనానికి పోటెత్తిన భక్తజనం..
  • అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి,
    ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ,
    ఈటెల రాజేందర్ ..
  • బంగారు బోనంతో ఎమ్మెల్సీ కవిత, ప్రిన్సిపాల్ సెక్రటరీ
    శాంతి కుమారి..

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి.. పోతురాజుల విన్యాసాలు, అమ్మవారికి బోనం, భక్తుల కోలాహలం నడుమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున మూడున్నరకు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాలుగు గంటల 15 నిమిషాలకు అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులకు అనుమతిచ్చారు. అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని మొక్కలు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తరలివచ్చారు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మంత్రి మల్లారెడ్డి, బిజెపి అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, గ్రేట్ హైదరాబాద్ బి ఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఈటల రాజేందర్, దానం నాగేందర్, ముఠాగోపాల్, పద్మాదేవేందర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, సికింద్రాబాద్ ఆర్డీవో, వసంత కుమారి, స్థానిక రామ్ గోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన చేసే ప్రభుత్వం వస్తుందని.శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రజలకు మంచి పాలన చేసే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.. తెలంగాణ ప్రజలను సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు అయన విలేకరులకు వెల్లడించారు .

- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి : మంత్రి మల్లారెడ్డి
సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో దేశానికి ప్రధాన మంత్రి కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ మేరకు లష్కర్ లోని శ్రీ మహంకాళి ఆలయంలో కుటుంబ సమేతంగా కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో అమలౌతున్న తాగు నీరు, సాగు నీరును దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాన మంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాలో బిజెపి ప్రభుత్వం : ఈటెల రాజేందర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతోందని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అయన దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈటెల రాజేందర్ అన్నారు. వచ్చే జాతర నాటికి అమ్మవారి ఆశీస్సులతో కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.. మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకున్నారు.. పట్టు వస్త్రాలను అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బంగారు బోనం సమర్పించారు. ముందుగా మంత్రి తలసాని నివాసం గాస్ మండిలో ప్రత్యేక పూజలు చేసిన కవిత అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నివాసం నుండి బంగారు బోనంతో మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కవిత వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బి ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు