Wednesday, October 9, 2024
spot_img

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తప్పక చదవండి

శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా 40,343 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు