- హత్య కేసును చేదించిన పోలీసులు
- వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట
- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ జిల్లా, పథకం ప్రకారం ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2వ తేదీన చోటు చేసుకోగా ఈ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేదించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిరచారు. మోమిన్ పేట మండల పరిధిలోని లచ్చా నాయక్ తండ గ్రామానికి చెందిన విటల్ నాయక్, నేరస్తులైన మోతిలాల్, పవన్ లు దగ్గర సంబందికులు. వీరి మధ్య గత కొంతకాలంగా లుచ్చా నాయక్ గ్రామ పరిధిలో గల సర్వే నెంబరు 75/13 లో 2 ఎకరాల 3 గంటల భూమి విషయంలో తగాదా మొదలైంది. ఈ భూమి విషయంలో 30 లక్షల నష్టం కలిగించాడని, అంతేగాక రాజకీయంగా తనను ఒంటరి వాడిని చేసి ఎదగనీయకుండా అడ్డుపడుతున్న విటల్ పై పగ పెంచుకున్న మోతిలాల్ తన తమ్ముళ్లయిన పవన్, నరేందర్ లు దగ్గరి బంధువైన రమేష్, పవన్ స్నేహితులైన రాజు, నరేష్ లతో కలిసి విఠల్ పై కుట్ర పన్ని వాహనంతో గుద్ధి చంపితే యాక్సిడెంట్ కేసుగా కనిపిస్తుందని పథకం వేసి కర్ణాటక నుండి తుఫాన్ వాహనాన్ని తెప్పించి సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన సల్మాన్ అనే ఒక డ్రైవర్ను రాజు సహాయంతో లక్ష రూపాయలకు బేరం మాట్లాడుకున్నారు. కుట్రలో భాగంగా ఈనెల 1వ తేదీన కాపుగాసినప్పటికీ బైక్ పై వెళుతున్న విట్టల్ కు హెల్మెట్ ఉన్న కారణంగా ఆరోజు వదిలిపెట్టి వరసటి రోజు కాపుగాసి మేకవలంపల్లి దాటిన తర్వాత గోదాం సమీపంలో ఢీకొట్టగా విటల్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ కింద పడగా బైక్ వెనుకాల ఉన్న అతడి బార్య కింద పడటంతో గాయాలయ్యాయి. విటల్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నేరస్థులను పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించగా మొత్తం ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేదించడంలో ప్రత్యేక కృషి చేసిన డిఎస్పి సత్యనారాయణ, సీఐ వెంకటేశం, ఎస్సైలు సంతోష్, భరత్ భూషణ్, అరుణ్ కుమార్, ఆనంద్, మోమిన్ పేట ఎస్సై విటల్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నేరస్తులైన మెఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్, మహమ్మద్ సల్మాన్,బానోవత్ జైపాల్, జుంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వీరినీ కోర్టులో హాజరు పరిచి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.