Friday, September 13, 2024
spot_img

ఒక్క రూపాయి’కే కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్నమురుగన్‌ హాస్పిటల్‌ నుండి మరికొన్ని సేవలు

తప్పక చదవండి

పంజాగుట్ట మురుగన్‌ హాస్పిటల్లో ఆరోగ్య శ్రీ, సి.జి.హెచ్‌.ఎస్‌, ఈ. ఎస్‌.ఐ.సి ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు ప్రారంభం..

హైదరాబాద్‌ : పేద మరియు మధ్య తరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోగడిచిన రెండు వందల రోజుల్లో 5 వేల మందికి పైగా ఒక్క రూపాయి డాక్టర్‌ కన్సల్టెంట్స్‌ ఫీజుతో వైద్య సేవలు అందించడం జరిగింది. మరింతగా ఈ సేవలు విస్తృతంగా అందించడం కోసం పంజాగుట్ట మురుగన్‌ హాస్పిటల్‌ మరో అడుగు ముం దుకు వేసింది. గురువారం నాడు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఖైరతాబాద్‌ ఎం.ఎల్‌.ఏ దానం నాగేదర్‌, నాంపల్లి ఎం.ఎల్‌.ఏ జఫర్‌ హుస్సేన్‌ మిర్జా, పొంగేలెటి సుధాకర్‌ రెడ్డి, తీన్మార్‌ మల్లన్న, సుద్దాల అశోక్‌ తేజ, కార్పొరేటర్‌ విజయా రెడ్డి, మేడ్చల్‌ జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్‌ దర్గా దయాకర్‌, బోయినపల్లి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దోశేగోని శ్రీనివాస్‌ గౌడ్‌, పీర్జదిగుడా జనరల్‌ సెక్రటరీ పాశం రాజుయాదవ్‌, సినీ ప్రముఖులు హీరో సోహెల్‌, సినీనటి అనుపమ స్వాతి, మరియు కమిక సింగ్‌ వేళ్ళ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మురుగన్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏలూరి బాలచందర్‌ (భాను) మాట్లాడుతూ హైదరాబాద్‌ హార్ట్‌ లాంటి ప్రదేశం పంజాగుట్ట ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ప్రదేశం గ్రామాల్లో నుంచి వచ్చే వారికి కూడా ఈజీ గా ఉండే ఏరియా కాబట్టి ప్రజలందరూ ఈ సేవలను వినియోగు చుకోవలసిందని తెలిపారు.అదేవిధంగా మురుగన్‌ హస్పిటల్స్‌ పంజాగుట్ట 5 కిలోమీటర్ల పరిధిలో రూ.1 /- అంబులెన్స్‌ సేవలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ ఏలూరి కృష్ణ, మురుగన్‌ హాస్పిటల్‌ డైరెక్టర్స్‌ నాగేశ్వరరావు, బిక్షాపతి , పి.విజయ్‌ కుమార్‌ , రాంబాబు, రఘు, డాక్టర్‌ శ్రావణి, సోని, భవాని మరియు డాక్టర్‌ స్వాతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ ఒక రూపాయి సేవలు మరియు ఆరోగ్య శ్రీ, వంటి సేవలను వినియోగుచుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు