Monday, April 15, 2024

గాల్లో కలిసిపోయిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ.. ?

తప్పక చదవండి
  • వీ.ఆర్.ఓ. వ్యవస్థను రద్దు చేసిన కేసీఆర్..
  • ఇప్పుడు వీ.ఆర్.ఏ. వ్యవస్థకు తిలోదకాలు..
  • గ్రామాల్లోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసే కుట్ర..
  • గతంలో ప్రతి భూమి ఖాతా, పహాణీ నమోదయ్యేది..
  • కొరవడిన గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు పార్సిల్స్ వ్యవస్థ..
  • చరిత్ర పుస్తకాల్లో తప్ప ప్రభుత్వ భూములు
    కనుమరుగయ్యే ప్రమాదం..
  • ధరణిలో జోరుగా సాగుతున్న దగా..
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘ ఆదాబ్ ‘ ప్రత్యేక కథనం..

గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ, మండల స్థాయిలో పకడ్బందీగా పనిచేస్తూ ఉండేది.. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్స్ భూములు, వక్ఫ్ భూములు, లావణ్య పట్టా భూములు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ భూములు తదితరాలు ఎప్పటికప్పుడు ప్రతినెల లెక్కలు చూసి కలెక్టర్ కు సమర్పించేవారు వీ.ఆర్.ఓ., వీ.ఆర్.ఏ.లు దాంతో ఎంతమేర ప్రభుత్వ భూమి ఉంది..? ఆ భూములను ఇతరత్రా ప్రజా ఉపయోగార్ధము వినియోగించవచ్చు అన్న లెక్కలు ప్రభుత్వం దగ్గర పదిలంగా ఉండేది.. అయితే ఈ భూములను అన్యాక్రాంతం చేసే దిశగా తెలంగాణా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
హైదరాబాద్ : గతంలో స్వర్గీయ ఎన్.టి. రామారావు ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల వద్దకు పరిపాలన అవినీతి రహితంగా, సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో పత్వారీ వ్యవస్థను రద్దుచేసింది.. వారి స్థానంలో విలేజ్ అసిస్టెంట్లు బాధ్యతలు స్వీకరించారు.. పట్వారీ వ్యవస్థలో కుటుంబ పాలన సాగుతోందని, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతోందని ఆ పరిణామాలని క్రమబద్దీకరించి ప్రయత్నంలో భాగంగా పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ఎన్ఠీఆర్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. అదీ కాకుండా కేవలం ఒకే కులానికి చెందిన వారు మాత్రమే పట్వారీ పద్దతికి చరమగీతం పాడారు.. అప్పట్లో ఈ నిర్ణయం పలు విమర్శలకు దారి తీసింది.. కాలక్రమేణా ప్రజలు కూడా రెవెన్యూ వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు అలవాటు పడ్డారు.. పైగా కొంతమంది పట్వారి వ్యవస్థలో విధులు నిర్వహించిన వారిలో విద్యార్హతలు కలిగిన కొందరిని విల్లెజి అసిస్టెంట్ పోస్టుల్లో నియమించడం కూడా అప్పటి ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయ్యిందనే చెప్పాలి.. ఈ క్రమంలో మండల వ్యవస్థను కూడా అమల్లోకి తీసుకుని రావడం జరిగింది.. అప్పటినుంచి గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సజావుగా పనిచేయడం జరుగుతోంది.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు.. నిజానికి గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు అధికంగా ఉంటాయి.. ఎందుకంటే పట్టణాలతో పోలిస్తే, గ్రామాల్లో జనాభా స్థాయి తక్కువుగా ఉంటుంది.. గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆదారిపడి జీవిస్తుంటారు.. నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రజలకు ఆహార ఉత్పత్తులు గ్రామాలనుంచి సమకూరుతుంటాయి.. ఇది నిజం.. అందుకే జై కిసాన్ అంటుంటారు.. కానీ రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది.. ఎన్ని ప్రభుత్వాలు అధికార పగ్గాలు చేపట్టినా వారి పరిస్థితుల్లో మార్పు కానరావడం లేదు.. ఇది మరో సబ్జెక్టు.. ప్రస్తుతం మనం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ గురించి చర్చించుకుంటున్నాము.. వ్యవసాయ భూములను పక్కనబెడితే.. ప్రభుత్వానికి సంబంధించిన భూములైన, ఎండోమెంట్స్, వక్ఫ్, లావన్ భూములు, వివిధ రాష్ట్ర డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన భూములు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు నెలకొని ఉంటాయి..
ప్రస్తుతం ఈ భూములు కనుమరుగవుతున్నాయి.. దీనికి కారణం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు విశ్లేషకులు.. ప్రభుత్వ భూములను తమ వారికి కట్టబెట్టడానికి కుట్రలు పన్నుతున్నారన్నది ఆరోపణ.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి.. వీ.ఆర్.ఓ. లు వీ.ఆర్.ఏ. లు గ్రామస్థాయిలో విధులు నిర్వహిస్తూ వారి పరిధిలోని భూముల వివరాలను ప్రతి ఖాతాను, పహాణీని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ.. గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు పార్సిల్స్ నిర్వహిస్తూ, పర్యవేక్షణ చేస్తూ జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తూ ఉంటారు.. ఇప్పుడు ఆ పరిష్టితి కొరవడింది.. 2018 లో కేసీఆర్ ప్రభుత్వం వీ.ఆర్.ఓ. వ్యవస్థను రద్దుచేసి వారినందరినీ వేరే డిపార్ట్మెంట్ లో క్రమబద్దీకరించి చర్యలు చేపట్టింది.. ఇప్పుడు వీ.ఆర్.ఏ. లకు ఉద్వాసన పలికి ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే భారీ కుట్రకు తెరలేపుతోంది కేసీఆర్ ప్రభుత్వం.. వీ.ఆర్.ఓ., వీ.ఆర్.ఏ., లు లేకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ కేవలం మండలానికి మాత్రమే పరిమితమై పోతోంది.. వారు నిర్వహించాల్సిన బాధ్యతలను మండల స్థాయిలో ఎమ్మార్వోలు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియల్ అసిస్టెంట్స్ చూసుకోవాల్సి వస్తోంది.. దీనితో వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వీలు లేకుండా పోతోంది.. తద్వారా గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు పార్సిల్స్ నిర్వాణకు గండి పడుతోంది.. దీనితో గ్రామస్థాయిలో నెలకొనివున్న ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి.. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ ఉద్యోగులను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు మార్చే కుట్రను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోంది.. సమూలంగా వీ.ఆర్.ఏ. వ్యవస్థను నిర్మూలించిన తరువాత సమూలంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది భయంకర వాస్తవం.. కాగా 2018 నుంచి గ్రామస్థాయిలో గవర్మెంట్ ల్యాండ్ బ్యాంకు పార్సిల్ యొక్క నివేదిక, వాటి వివరాలు ఎవరు చూస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. ప్రభుత్వం ఎవరినైనా దీని నిర్వహణకు స్పెషల్ గా నియమించిందా..? అన్నది తెలియాల్సి ఉంది..

పైగా గడచిన 3 సంవత్సరాల కాలంలో ల్యాండ్ రెగ్యూలరైజేషన్ జీఓ ల ద్వారా అనర్హులకు కట్టబెట్టిన భూమి ఎంత మేర ఉందో తెలియాల్సి ఉంది.. కాగా అప్పట్లో ప్రతి గ్రామంలో నెలకొని ఉన్న అసైన్డ్, సీలింగ్ భూముల మీద రెవెన్యూ ఉద్యోగులకు అవగాహన ఉండేది.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.. గ్రామ స్థాయిలో వున్న ప్రభుత్వ భూముల పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది.. మండల వ్యాప్తంగా ప్రస్తుతం ఎమ్మార్వో, డీటీ, ఆర్.ఐ. లు కేవలం ఒక్కొక్కరిగానే ఉండటంతో కేవలం ఈ ముగ్గురి పర్యవేక్షణలో పూర్తి మండలంలోని భూముల నిర్వహణ, వివరాల సేకరణ గగనం అవుతోంది.. తద్వారా భూముల వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అవుతోంది.. ఇక వీ.ఆర్.ఏ. లను కూడా తొలగించి వారిని ఇతర డిపార్ట్మెంట్లలో క్రమబద్దెకరించే క్రమంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కొల్లగొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోదని విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మార్వో, ఆర్.డీ.ఓ., ల యొక్క అహఁడికారాలకు గండికొడుతూ.. జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు ఇవ్వడం జరుగుతోంది.. ఇక్కడే అసలు కుట్ర మొదలవుతోంది.. అధికారాలు అందిపుచ్చుకున్న కలెక్టర్లు ఈ సమస్త బాధ్యతలను ధరణి పోర్టల్ వచ్చాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుని వారికి అప్పజెప్పడం జరుగుతోంది.. ఇది అత్యంత ప్రమాదమని రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులే వాపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ధరణి పోర్టల్ ద్వారా అంతా మంచే జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం రైతులను, సామాన్య భూ యజమానులు దారుణంగా మోసం చేస్తోంది.. ధరణితో ప్రయోజనం జరుగుతుంది అన్నది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.. ఘంటారావం పేరుమీద ప్రతిరోజూ వీ.ఆర్.ఓ. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ.. వారిని తొలగించడం, ఆ వ్యవస్థనే నిర్మూలించడం ఇతర డిపార్ట్మెంట్లలో వారిని క్రమబద్ధీకరించడం ప్రభుత్వ కుట్రలో భాగంగానే చూడవచ్చు.. మండల స్థాయిలో భూముల నిర్వహణ చేయడం అన్నది ఎండమావిలో నీళ్లకోసం వెదికినట్లే అవుతోంది.. అయితే ఇప్పటికీ కొందరు ఎమ్మార్వోలకు, ఆర్దీఓ లుగా పదోన్నతులు కల్పించిన అధికారులకు ఇప్పటికీ ఎక్కడా పోస్టింగులు ఇవ్వకపోవడం శోచనీయం.. నలుగురు చేయాల్సిన పనులను ఒక్కరితో చేయించి చేతులు దులుపుకుంటున్నారు.. తద్వారా ధరణి పోర్టల్ లో అంతులేని దగా జరుగుతోంది అన్నది నిర్విదాంశం.. భవిష్యత్తులో గ్రామ స్థాయిలో వున్న ప్రభుత్వ భూముల లెక్కలు కనుమరుగైపోతాయి.. ఆ భూములు ప్రభుత్వ పెద్దలు తమవారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. రేపటి రోజున ఏ రాష్ట్రం వారైనా, విదేశీయులైనా తెలంగాణాలో ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా.. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే ముందుకు వస్తారు.. అలా కాకుండా ఉంటే ఎవరూ ముందుకు రారు.. దీనితో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లిపోతాయి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ రావడం లేదు.. కనీసం ప్రయివేట్ సంస్థలు కూడా లేకుండా పోతే నిరుద్యోగం పెరికి యువత నిర్వీర్యమైపోతుంది.. అదే కాకుండా మరేదైనా ప్రజా ఉపయోగకరం కార్యక్రమాలకు భూములు కావాలన్నా ఒక్క గుంట భూమి కూడా దొరకని ప్రమాదం ఏర్పడబోతోంది.. ప్రయివేటు వ్యక్తుల వద్ద భూములు కొని పరిశ్రమలు స్థాపించాలంటే అత్యంత కష్టమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు..

- Advertisement -

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ భూములను కాజేసే కుట్రలకు తెరలేపిన అధికార పార్టీ ఆగడాలను మరిన్ని వాస్తవాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’… ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు