నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాంతీయ ఆత్మ గౌరవ ఉనికి మూలాల మీద ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో పూర్తిస్థాయి ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడి జూన్ 2, 2023 తో తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గత గడిచిన తొమ్మిదేళ్లలో 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాల్లో అభివృద్ధి సాధించుకున్నామనేది కొన్ని నివేదికలు చెబుతున్న మాట వాస్తమే ఉదాహరణకి విద్యుత్, రైతుల సంక్షేమం, సాగు నీరు ఉమ్మడి రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు నిధుల కేటాయింపులు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన విషయం మనం గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో చాలానే చూశాం, ఇంకా చెప్పుకుంటే పోతే ఉమ్మడి పాలనలో జరిగిన వివేక్షత కారణంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత అనేక కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలతో పోటీపడి కొన్ని రంగాలలో వృద్ధి సాధించిన మాట వాస్తవమే అయితే ఈ వృద్ధి ఇంకా జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ అభివృద్ధి కేరళ లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా మనం అనేక రంగాల్లో వెనుకబడిన కఠోర వాస్తవాన్ని గుర్తించక తప్పదు, ఉదాహరణకు విద్య, ఉన్నత విద్య, ప్రజా ఆరోగ్యం, లైబ్రరీలు, రవాణా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పాలన మరియు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడము, ఆల్టర్నేటివ్ రంగాలలో ఉపాధి కల్పన ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో మనం వెనుకబడిన విషయం వాస్తవం, అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రత్యేక అనగారిన కులాల ప్రజల జనాభా శాతం ఎక్కువ అయితే వారి అభివృద్ధికి తోడ్పడు ప్రభుత్వాలు అనేక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అయితే అటువంటిది మన ప్రభుత్వాలు ఎంత మేరకు చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ విశ్లేషిద్దాం, అయితే ఇందులో ప్రత్యేకంగా మనం విశ్లేషించవలసిన అంశం ఏమిటంటే మహిళా సాధికారత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల సంక్షేమం కోసం మరియు వారి సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి మరియు వారి సంక్షేమం వారి సాంఘిక ఆర్థిక రాజకీయ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. ఇది ఏ ఆధారంగా మనం చర్చిస్తున్నాము అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొదటి పాలన అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా క్యాబినెట్లో మరియు ప్రధాన శాఖలలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలే, ఎంతోకొంత ఇస్తే కవిత లాంటి వాళ్లకే ఇవ్వడము ఆమెకు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం జరిగినాయి, రెండోసారి అధికారంలో వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమ ఇదే ధోరణిని ప్రదర్శించింది, అయితే మహిళలకు ప్రాధాన్యత ఇస్తే అది కేవలం కాస్త కూసో వారిని నామ మాత్రమే మహిళా శిశు సంక్షేమ శాఖకు మరియు వినతులు ఫిర్యాదుల తర్వాత ఏర్పడిన మహిళా కమిషన్ కు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది, అలా కాకుండా వారికి పూర్తిస్థాయి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము, ప్రపంచం అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని అనేక చర్చలు చేస్తున్న వేళ మనదేశంలో మాత్రం మహిళలు వంటిళ్లకే పరిమితం కావాలని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అనేక ప్రజా వేదికల మీద వ్యాసాలు దంచుతూనే ఉన్నారు, ఇటువంటి సమయంలో ప్రత్యేకంగా సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమయాలలో రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహిళా లోకానికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, మరియు వారికి అన్ని రంగాలలో పురుషులతోపాటు సమాన అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది అది మనం గ్రామస్థాయిలో మాట్లాడుకునే సర్పంచ్ పదవుల నుంచి రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వరకు వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు చూసుకుంటే రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తున్నాయి అనేక ఉద్యోగాలు కల్పన సాధ్యమైతుంది అని చెబుతుంది అయితే వీటిలో మహిళల వాటా ఎంత అన్న విషయం కూడా ప్రభుత్వాలు చెప్పవలసిన అవసరం ఉంది, ఇంకా మొన్నటికి మొన్న చూసుకుంటే యూకే యూఎస్ పర్యటన చేసిన కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ తను ఒక టీం తో యూకే యూఎస్ పర్యటన చేశారు అందులో ఒక్క మహిళ కూడా లేకపోవడం మన అద్వాన పరిస్థితికి అద్దం పడుతుంది చాలా లిబరల్ ఆలోచనలతో ఉండే కేటీఆర్ కూడా ఈ విషయాన్ని గ్రహించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టి వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అలా కాకుండా మహిళలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలతో లక్ష రూపాయల పెళ్లి కానుకగా ప్రభుత్వ సహాయం ఇస్తే వారి భవిష్యత్తు మరియు వారి సాధికారత కేవలం పెళ్లిళ్ల వంటింట్లోనే మగ్గుతూ ఉంటుంది ఇప్పటికైనా టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయి అధ్యయనం చేసి మహిళా సాధికారత కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- అశోక్ ధానావత్