Saturday, June 15, 2024

నిధుల దుర్వినియోగంపై చర్యలు ఎక్కడ.?

తప్పక చదవండి
  • విచారణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన సంఘం రాష్ట్ర కన్వీనర్ కేటీ నర్సింహారెడ్డి డిమాండ్..
  • కోట్ల నిధులను అక్రమంగా కైకర్యం చేశారు..
  • నామ మాత్ర పనులతో నిధులను దుర్వినియోగం చేశారు..

కొందరు అవినీతి అధికారుల ధన దాహంతో ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులను కైకర్యం చేశారు.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అంటారు.. అలాంటి గ్రామాలను నిర్వీర్యం చేస్తున్నారు.. అవినీతి అధికారులను కఠినంగా శిక్షించి, దుర్వినియోగం అయిన నిధులను అవినీతి అధికారుల నుండి తిరిగి వసూలు చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి..

ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి పనులకు అందించిన నిధులను అధికారులు దుర్వి నియోగం చేశారని, వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ రక్షణసేన సంఘం రాష్ట్ర కన్వీనర్ కేటీ నర్సింహారెడ్డి డిమాండ్ చేశాడు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఇచ్చిందన్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులను నామమాత్రంగా చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం సమాచారం మేరకు మండలానికి పలు అభివృద్ధి పనులకు 2014 నుంచి నేటి వరకు వివిధ శాఖల ద్వారా రూ.200కోట్ల నిధులు అందించిందన్నారు. అట్టి నిధులతో అధికా రులు గ్రామాల్లో వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ షెడ్లు, క్రీడా మైదానాలు, సీసీరోడ్లు, డ్రెయినేజీల ని పనులను నామమాత్రంగా చేపట్టి దాదాపుగా రూ.70కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. అక్రమ వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు