Tuesday, May 14, 2024
Array

తెలంగాణ ఊటీకి మహర్ధశ

తప్పక చదవండి
  • టూరిజం పాయింట్‌గా అనంతగిరి ఎంపిక
  • అధికారులతో సమీక్ష సమావేశం
    నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి
    వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ లో ఉన్న అనంతగిరి తెలంగాణ ఊటీగా పిలువబడుతుందని, ఇది హైదరాబాద్‌ కు అతి సమీపంగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు.బుధవారం కలెక్టర్‌ కార్యాల యంలోని కాన్ఫరెన్స్‌ హాలులో స్వదేశ్‌ దర్శన్‌ లో భాగంగా డిస్టినేషన్‌ ప్రాజెక్టు క్రింద అనంతగిరి అభివృద్ధిపై యల్‌ అండ్‌ టి ఇంజనీర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనంత గిరిని టూరిజం పాయింట్‌ గా అభివృద్ధి పరిచేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అనంతగిరి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ కింద ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో అనే అంశంపై సమావేశంలో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా అనంతగిరిలో ఈకో పార్క్‌, వాకింగ్‌ ట్రాక్‌, దేవాలయ అభివృద్ధి, వచ్చే పర్యాటకులకు వసతి, పార్కింగ్‌ సౌకర్యం, రెస్టారెంట్‌, పిల్లలకు ఆటస్థలం, నేటి సదుపాయం తదితర అంశాల ఏర్పాట్లపై చర్చించడం జరిగినది.ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి హనుమంతరావు, ఇరిగేషన్‌ ఈఈ జెప్సినాథ్‌ ఎల్‌ అండ్‌ టి సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు